తెలుగు మీద పడ్డ పవన్‌  

Pawan Kalyan Comments On Jagan Reddy - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan Launch The English Medium In Schools, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాన్నే పదే పదే మాట్లాడటం దాని గురించి పదే పదే ట్వీట్స్‌ చేయడం చేస్తూ ఉంటాడు.కొన్ని రోజుల తర్వాత ఆ విషయం ఊసే ఎత్తడనే విమర్శలు ఉన్నాయి.

Pawan Kalyan Comments On Jagan Reddy

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తెలుగు భాష గురించి పదే పదే మాట్లాడుతున్నాడు.ప్రస్తుతం ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశ పెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తెలుగు భాష గురించి మాట్లాడాడు.జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేజీ నుండి పీజీ వరకు కూడా అంతా తెలుగు మీడియంలోనే భోదిస్తామంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు.

పవన్‌ ప్రస్తుతం తెలుగు భాష గురించి పదే పదే సోషల్‌ మీడియాలో ప్రస్తావించడంతో చాలా మంది మరే విషయం లేదా అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు.జగన్‌ ప్రభుత్వం దాన్ని తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఇంకా దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు అంటూ పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు