వైకాపా ప్రభుత్వం 100 డేస్‌పై పవన్‌ నివేదిక  

Pawan Kalyan Comments On Jagan Mohan Reddy Govt Rulling-janasena Chief,pawan Kalyan,pawan On Press Meet

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు వంద రోజులు కుదురుకునేందుకు సమయం ఇస్తామని, ఆ తర్వాత నుండి ప్రజా సమస్యలపై ఉద్యమం చేస్తానంటూ మొదట్లోనే ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నట్లుగానే వైకాపా 100 రోజుల పరిపాలన పూర్తి అయిన తర్వాత తన విమర్శలు ప్రారంభించాడు.ఈ వంద రోజుల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను పవన్‌ కళ్యాణ్‌ నేడు అమరావతిలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరీ వివరించాడు.మూడు రోజుల పాటు అమరావతిలోనే ఉండబోతున్న పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

Pawan Kalyan Comments On Jagan Mohan Reddy Govt Rulling-janasena Chief,pawan Kalyan,pawan On Press Meet-Pawan Kalyan Comments On Jagan Mohan Reddy GOVT Rulling-Janasena Chief Pawan Press Meet

నేడు ప్రెస్‌మీట్‌లో పవన్‌ మాట్లాడుతూ.గత ప్రభుత్వం ఇసుక మాఫియా కారణంగానే అధికారం కోల్పోయింది.తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే కొత్త ఇసుక పాలసీని తీసుకు వస్తామని జగన్‌ అన్నారు.

Pawan Kalyan Comments On Jagan Mohan Reddy Govt Rulling-janasena Chief,pawan Kalyan,pawan On Press Meet-Pawan Kalyan Comments On Jagan Mohan Reddy GOVT Rulling-Janasena Chief Pawan Press Meet

కాని ఇసుక టన్ను రూ.375 ఉంటే ఏకంగా దాన్ని రూ.500 లకు పెంచారు.దాంతో భవన నిర్మాణం పూర్తిగా సన్నగిల్లింది.భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.వంద రోజులు అయినా కూడా కొత్త ఇసుక పాలసీని తీసుకు రావడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని పవన్‌ అన్నాడు.వైసీసీ చెప్పినట్లుగా మేనిఫెస్టోను అమలు చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం.కాని ఇప్పటికే రాష్ట్రం రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది.విద్యుత్‌ కొనుగోలుతో పాటు పలు విషయాల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించారు.కియా పరిశ్రమ సీఈఓను అవమానించారు.ఇలా అయితే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించాడు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ ఫలితం ఏంటీ అంటూ జగన్‌ ప్రశ్నించాడు.

ప్రతి విషయంలో కూడా ప్రజలను గందరగోళంకు గురి చేయడంతో పాటు రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.