బాలయ్య తిట్లపై ... తిట్టిన పవన్ ! రియాక్షన్ ఎలా ఉంటుందో...?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు… ప్రసంగాల్లో వేడి బాగా పెంచారు. ప్రజల్లో పార్టీపై సానుకూల పెరుగుతుండడంతో ఆయన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అక్కడ మైనింగ్ కంపెనీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు . ఆ తరువాత సభలో మాట్లాడిన పవన్ బాలకృష్ణ తిట్లను గురించి ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. తోటి నటుడు బాలయ్యను విమర్శించడంపై అందరూ షాక్ తిన్నారు.

Pawan Kalyan Comments On Balakrishna Scolding-

Pawan Kalyan Comments On Balakrishna Scolding

పవన్ వ్యాఖ్యలపై బాలయ్య స్పందించకపోయినా… బాలయ్య- పవన్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బాలయ్య తిట్ల గురించే కాదు పనిలో పనిగా మీడియా సంస్థల తీరుపైనా పవన్ స్పందించాడు. తాను అక్రమాలకు పాల్పడుతున్న ఆండ్రూ కంపెనీ వాడిని లఫూట్ అని తిడితే టీవీ ఛానల్స్ డిబేట్ పెట్టాయని, మరి అడ్డగోలు తవ్వకాల గురించి లేదా బాలకృష్ణ అమ్మ, ఆలీ బూతులు తిట్టినప్పుడో ఎందుకు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్షలో ప్రధానమంత్రి తల్లిని బాలకృష్ణ తిట్టలేదా..? పవన్ కళ్యాణ్ గోక్కున్నాడు, లఫూట్ అన్నాడు అని మాత్రం డిబేట్లు పెడతారా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan Comments On Balakrishna Scolding-

దెందులూరు ఎమ్మెల్యే మహిళా తహసీల్దారును కొట్టినప్పుడు, మాదిగలను తిట్టినప్పుడు డిబేట్లు పెట్టరని, మా జనసైనికులు, అభిమానులే నా ఛానల్స్ నా ఫేస్‌బుక్, నా రేడియో నా పత్రికలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. 2014లో తాను టీడీపీకి మద్దతివ్వడం ధర్మమని చెప్పారు. దేవుడు లేని ఊళ్లో మంచం కోడెనే పోతురాజు అంటారని, అలాగే అప్పుడు ఉన్నవి టీడీపీ, వైసీపీ, వైసీపీ జగన్ అవినీతి కేసుల్లో ఉన్నారని, పైగా చంద్రబాబుకు అనుభవం ఉందని, అందుకే మద్దతిచ్చానని చెప్పారు. తప్పు చేస్తే ధర్మం ఓ అవకాశమిస్తుందని, లేదంటే నిర్దాక్ష్యిణ్యంగా అలాంటివారిని కూలదోస్తుందన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి కౌంటర్ లు బాగానే పడ్డాయి. అయితే ఈ వ్యవహారంలో అనూహ్యంగా బాలయ్య పేరు ప్రస్తావనకు రావడంతో … సోషల్ మీడియాలో బాలయ్య – పవన్ వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది.