ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనుకున్నా.. పవన్ కీలక వ్యాఖ్యలు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వకీల్ సాబ్ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Comments About Suswagatam Shooting Time Incidents-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో ఒక సన్నివేశం చేసే సమయంలో పారిపోవాలని అనుకున్నారని సమాచారం.చాలా సందర్భాల్లో పవన్ తాను గొప్ప యాక్టర్ ను కాదని డ్యాన్సర్ ను కాదని పర్ఫార్మర్ ను కాదని చెప్పుకొచ్చారు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో తనకు జనాల మధ్యలో డ్యాన్ చేయాలంటే సిగ్గు, మొహమాటం అని పవన్ తెలిపారు.ఔట్ డోర్ షూటింగ్ అన్నా తాను అలానే ఫీల్ అవుతానని పవన్ చెప్పుకొచ్చారు.

 Pawan Kalyan Comments About Suswagatam Shooting Time Incidents-ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనుకున్నా.. పవన్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుస్వాగతం మూవీలో ఒక సన్నివేశం కోసం రోడ్డు మీద డ్యాన్స్ చేయమని చెప్పినప్పుడు ఆ సీన్ చేయడం తన వల్ల కాలేదని పవన్ అన్నారు.రోడ్డుపై డ్యాన్స్ చేయాలని చెబితే తనకు ఎబ్బెట్టుగా అనిపించిందని పవన్ చెప్పుకొచ్చారు.

Telugu Corona Second Wave, Dancing Between People, Pawan Kalyan, Pawan Kalyan Shy, Sagar K Chandra, Suswagatam Movie, Vakeel Saab-Movie

ఆ సమయంలో తాను సినిమాల నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఆ సమయంలో సాధారణ హీరో అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.పవన్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని సైతం తట్టుకుని భారీ కలెక్షన్లను సాధించారు.

Telugu Corona Second Wave, Dancing Between People, Pawan Kalyan, Pawan Kalyan Shy, Sagar K Chandra, Suswagatam Movie, Vakeel Saab-Movie

ప్రస్తుతం సాగర్ కె చంద్ర అనే డైరెక్టర్ డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు.పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది.

#DancingBetween #Sagar K Chandra #Vakeel Saab #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు