నోట్ల ర‌ద్దుపై ప‌వ‌న్ కామెంట్లు కామెడీగా ఉన్నాయా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాత్రికి రాత్రి తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే.అధికార బీజేపీ దీనిని గొప్ప సంస్క‌ర‌ణ‌గా పేర్కొంటే.

 Pawan Kalyan Commenets On Currency Ban-TeluguStop.com

కాంగ్రెస్‌, సీపీఎం, బీఎస్పీ, వంటి అనేక విప‌క్ష పార్టీలు మాత్రం తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌డుతున్నాయి.వ‌రుస‌గా పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల‌ను సైతం పెద్ద ఎత్తున స్తంభింప‌చేస్తున్నాయి.

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం బీజేపీ నేత‌ల‌కు ముందుగానే తెలిసింద‌ని, వాళ్లు సంచులు స‌ర్దేశాక ప్ర‌ధాని ప్ర‌క‌టించార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే నోట్ల ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ.

సోమ‌వారం భార‌త్ బంద్‌కు సైతం పిలుపునిచ్చాయి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.

అధికార టీడీపీ సార‌ధి చంద్ర‌బాబు.ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.

అంతేకాదు, మ‌రో అడుగు ముందుకేసి.అస‌లు పెద్ద నోట్లను ర‌ద్దు చేయాల‌ని తానే ప్ర‌ధానికి లేఖ రాసిన‌ట్టు చెప్పారు.

ఆ ఫ‌లితంగా ఇప్పుడు దేశంలో నోట్ల ర‌ద్ద‌యి పోయాయ‌ని క‌ల‌రింగ్ ఇచ్చారు.ఇక‌, ఏకైక విపక్షం వైకాపా కూడా నోట్ల ర‌ద్దును స్వాగ‌తించింది.

న‌ల్ల‌ధ‌నంపై పోరు సాగాల్సిందేన‌ని చెప్పింది.అయితే, ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేయ‌డంలో మాత్రం కేంద్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని పెద్ద ఎత్తున ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైకాపా అధినేత జ‌గ‌న్‌.

ఇదిలావుంటే, ఇప్పుడు ఈ విష‌యంపై గ‌ళ‌మెత్తిన జ‌న‌సేనాని.ప‌వ‌న్‌.

త‌న స్టైల్‌లో కామెంట్లు కుమ్మేశాడు.నోట్ల‌ర‌ద్దుతో జ‌నాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని అన్నాడు.

ఏటీఎంలో డ‌బ్బులు ఉండ‌వు, ఉన్నా భారీ ఎత్తున క్యూలు.ఇక‌, బ్యాంకుల వ‌ద్ద క్యూల‌లో నిల‌బ‌డ‌లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

అంటూ త‌న స్లైల్లో మాట్లాడిన ప‌వ‌న్‌.కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్లు కూడా చేశారు.

జ‌నాల బాధ‌లు తెలియాలంటే బీజేపీ ఎంపీలు రోడ్ల మీద‌కి రావాల‌ని పిలుపునిచ్చాడు.వాస్త‌వానికి తాను ఈ నోట్ల ర‌ద్దును వ్య‌తిరేకిస్తున్నాడా? స‌మ‌ర్ధిస్తున్నాడా? అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ని ప‌వ‌న్‌.మోడీపై మాత్రం విరుచుకుప‌డుతున్నాడు.

ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద‌కు వ‌చ్చి ఎంపీలు లైన్ల‌లో నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చాడు.అప్ప‌డే ప్ర‌జ‌ల‌కు ఒకింత ధైర్యంగా ఉంటుంద‌ని కూడా చెప్పాడు.ఇప్పుడు ఈ కామెంట్ల‌పైనే ప‌లు ప్ర‌శ్న‌లు పుడుతున్నాయి.

అస‌లు ప‌వ‌న్ చెబుతున్న విష‌యంలో స‌బ్జెక్ట్ లోపిస్తోంద‌ని అంటున్నారు.నోట్ల ర‌ద్దుతో తాత్కాలిక ఇబ్బందులు ఉన్న మాట నిజ‌మే అయినా.

దీర్ఘ‌కాలంలో అది ప్ర‌జ‌లకు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం చేకూర్చుతుంద‌న్న నిపుణుల మాట‌ల‌ను ప‌వ‌న్ ఎందుకు విస్మ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అదేస‌మ‌యంలో మోడీ నిర్ణ‌యాన్ని దేశంలో చాలా మంది స్వాగ‌తిస్తున్న విష‌యాన్ని సైతం ప‌వ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి గ‌తంలో ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌తో పోలిస్తే.నోట్ల ర‌ద్దుపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో ప‌స లేద‌ని తెలిసిపోతోంది.

పెద్ద ఎత్తున వ‌ర్క‌వుట్ చేయ‌కుండా ప‌వ‌న్ మాట్లాడాడు.అనే వ్యాఖ్య‌లు ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయాయి.

ఎలాంటి వ‌ర్క‌వుట్ చేయ‌కుండానే, ఫీడ్ బ్యాక్ లేకుండానే ప‌వ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube