వైసీపీతో పొత్తు లేదు పోరే ! క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారిన జనసేన – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయంలో అనేక ట్విస్ట్ లు .గత కొంతకాలంగా చోటు చేసుకున్నాయి.

 Pawan Kalyan Clarifies About Tie Up With Ys Jagan-TeluguStop.com

వైసీపీ జనసేన మధ్య అనేక అనేక రాయబారాలు జరిగాయి.పొత్తు ఫైనల్ అనుకున్న దశలో ఏమైందో ఏమో కానీ… పొత్తు సెట్ కాలేదు.

ఈ విషయంపై టీడీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో… ఈ విషయంలో అడపాదడపా జనసేన ఖండిస్తూనే వస్తోంది.తాజాగా చెన్నై లో పర్యటిస్తున్న పవన్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో కాల్ర్టీ ఇచ్చాడు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందంటున్నవార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

తాను మెుదటి నుంచి వైసీపీని విమర్శిస్తున్నానని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని ఎలా అనుకుంటారు అంటూ… ప్రశ్నించారు.తనకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలేనని తెలిపారు.ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

అయితే వైఎస్ జగన్ బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించడం లేదన్నారు.కేవలం తనపై కేసులు ఉన్నాయన్న భయంతోనే జగన్ ప్రత్యేక హోదాపై పెదవి విప్పడం లేదు అంటూ విమర్శించారు.2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందన్నారు.

2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందన్నారు.2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది జనసేన మాత్రమేనని పవన్ చెప్పుకొచ్చారు.అటు వైసీపీతో జనసేన నాయకులు రహస్యంగా చర్చిస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు.తాను ఏదైనా నేరుగా రాజకీయాలు చేస్తానని తెరవెనుక రాజకీయాలు చెయ్యబోనని తెలిపారు.

తాను వైసీపీతో పొత్తుపెట్టుకుంటే రహస్యంగా చర్చలు ఎందుకు జరుపుతానని నేరుగానే పొత్తు ప్రయత్నాలు చేస్తామని పవన్ క్లారిటీ ఇచ్చారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube