కరోనా కాలంలో ఎక్కువ విరాళం ఇచ్చిన తెలుగు స్టార్ హీరో ఇతనే?

ప్రస్తుతం దేశమంతటా కరోనా కాలం నడుస్తోంది.ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది.

 Tollywood Heros Donation To Poor People In Corona Virus Time  Pawan Kalyan, Chir-TeluguStop.com

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు,నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ వచ్చినా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించటానికి చాలా సమయం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వల్ల దేశంలో వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలోని ప్రజలంతా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరు ఎక్కువ విరాళం ఇచ్చారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Coronavirus, Nithin, Pawan Kalyan, Sai Dharam Te

పవన్ కళ్యాణ్ కేంద్రానికి కోటి రూపాయలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కోటి రూపాయల చొప్పున మొత్తం రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.పవన్ అభిమానులు జనసేవ పేరుతో లక్షల సంఖ్యలో ప్రజలకు సరుకులు, డబ్బు, ఇతరత్రా సహాయ సహకారాలు అందించారు.పవన్ తరువాత బాహుబలి ప్రభాస్ కేంద్రానికి మూడు కోట్లు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు.

ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పిలుచుకునే మహేష్ బాబు కరోనా బాధితుల కొరకు కోటి రూపాయలు ఇచ్చారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Coronavirus, Nithin, Pawan Kalyan, Sai Dharam Te

ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ గా పిలుచుకునే చిరంజీవి 75 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు, స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ కోటీ 25 లక్షలు విరాళం ఇచ్చారు.నితిన్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు సైతం తమవంతు సహాయం ప్రకటించారు.ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఎక్కువ సాయం ప్రకటించిన హీరోలలో పవన్ ముందువరసలో నిలిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube