జగన్ ది ఆశ అయితే... పవన్ ది అత్యాశా ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.మనసులో ఉండేది ఒకటి పైకి చెప్పేది ఇంకొకటి ఎందుకో ఈ దాగుడు మూతలు అర్ధంకావడంలేదు.

 Pawan Kalyan Changes His Opinion On Cm Post-TeluguStop.com

రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా కావాల్సింది ఒక క్లారిటీ.తాను ఏమవ్వాలనుకున్నాను.

ప్రజలకోసం ఏమి చేయాలి అనుకుంటున్నాను అనేది ముందుగా తెలుసుకోవాలి.ఇటీవల ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తే పవన్ రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి.

జగన్ ధ్యాస అంతా సీఎం పీఠం పైనే అని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే పవన్ ప్రజా సమస్యలు అంటూ జనాల్లో తిరుగుతున్నా .ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్తున్నా అంతిమ లక్ష్యం మాత్రం సీఎం కుర్చీనే కదా !

జగన్‌ మాదిరిగా నన్ను ముఖ్యమంత్రిని చేయమని ప్రజలను అడగను’ అని పవన్ అన్నాడు.ఇది అబద్ధం కాదా? వైకాపా అధినేత జగన్‌ వచ్చే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రినవుతానని చెబుతున్నారు.అవుతాడా, లేదా అనే సంగతి తరువాత.

ముందైతే ధైర్యంగా చెబుతున్నాడు.అదేమీ గొప్పలు చెప్పుకుంటున్నట్లు అనుకోకూడదు.

ఆత్మవిశ్వాసం అనుకవోచ్చు కదా.ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్‌ పార్టీ పెట్టి దాన్ని సాధించడానికి పోరాడుతున్నాడు.తనను ముఖ్యమంత్రిని చేస్తే ఫలాన సమస్యలు పరిష్కరిస్తానని పాదయాత్రలో చెబుతున్నారు.దీంట్లో పవన్‌కు ఏం తప్పు కనిపించింది? తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజలను పవన్ అర్ధించాడు కదా ! కారాన్తకలో కుమారస్వామిలా నేను చక్రం తిప్పుతా అంటూ మాట్లాడాడు.

రంజాన్‌ పండుగ సందర్భంగా పోరాట యాత్ర ఆపడానికి ముందు ప్రతి సభలోనూ ‘నన్ను ముఖ్యమంత్రిని చేయండి’ అంటూ పవన్‌ వేడుకున్నాడు.ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే బస్సు యాత్ర చేస్తున్నానని, ముఖ్యమంత్రి సీటుకు అర్హత సాధించాలంటే ముందు ప్రజాసమస్యలు తెలుసుకోవాలని ఓ సభలో పవన్‌ అన్నాడు.

యాత్ర ప్రారంభించడంతోనే ముఖ్యమంత్రి కోరికను వెల్లడించాడు.ఆ కోరికకు ఎవరూ అభ్యంతరపెట్టరు.

కాని ‘175 స్థానాలు గెలిచి చూపిస్తా’ అనడమే అందరిని ఆశ్చర్యపరిచింది.పదవుల మీద ఆశ లేదన్న పవన్‌ జనం ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు.

ఓ పదవులపై ఆశ లేదంటాడు.మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటాడు.

ఇలా రెండు రకాలుగా మాట్లాడుతూ జనాల్లో ఇంకా పలుచన అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube