పవన్ వల్ల కాదు.. జక్కన్న దిగాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ చిత్రాన్ని ‘వకీల్ సాబ్’గా మనముందుకు తీసుకొస్తు్న్నాడు పవన్.

 Pawan Kalyan Cannot Impress Bollywood But Rajamouli Can-TeluguStop.com

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టిన పవర్ స్టార్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

అయితే పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని పవన్-క్రిష్ భావించారట.

 Pawan Kalyan Cannot Impress Bollywood But Rajamouli Can-పవన్ వల్ల కాదు.. జక్కన్న దిగాల్సిందే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.అయితే బాహుబలి తరువాత బాలీవుడ్ జనాలను ఏ ఒక్క తెలుగు సినిమా కూడా మెప్పించలేక పోయింది.

ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి, సాహో వంటి సినిమాలు అక్కడ బొక్కబోర్లా పడ్డాయి.

దీంతో బాలీవుడ్ జనాలను మెప్పించడం ఇప్పట్లో జరిగే పని కాదని భావించిన పవన్-క్రిష్, తమ సినిమాను కేవలం సౌత్‌కే పరిమితం చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ రికార్డులను టచ్ చేయగల సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని, త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి రాజమౌళి మరోసారి బాలీవుడ్‌కు చుక్కలు చూపెట్టడం మాత్రం ఖాయం.

#Rajamouli #Krish #Pan India Movie #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు