అన్న కోసం సిద్దాంతాలు సైడేసిన జనసేనాని..!!!

నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.నిన్నటి రోజున పార్టీ కండువా కప్పుకున్న నాగబాబు ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ స్టేజీపై రక్తి కట్టించిన సీన్స్ అమోఘం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ తతంగం జరుగక ముందు నాగబాబు యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసి జగన్ , చంద్రబాబు లపై చేసిన కామెంట్స్ ,వేసిన జబర్దస్త్ స్కిట్లు అన్ని ఇన్ని కావు.పైగా ఇవన్నీ తమ్ముడు కోసం చేయడం లేదని తన కోసం మాత్రమే చేస్తున్నానని చెప్పిన నాగబాబు అసలు ముసుగు తీసి నిన్నటి రోజున జనసేనలో జాయిన్ అయిపోయారు.

సహజంగా అ ఒక వ్యక్తిపై ఆధారపడి నడిచే పార్టీలు ముందుగా ప్రజాభిమానం పొందడానికి కుటుంబ సభ్యులను ఆ పార్టీ వ్యవహారాల్లోకి రానివ్వరు అయితే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు తన సోదరులతో పాటు అందర్నీ పార్టీ కోసం వినియోగించుకున్నారు.చివరి నిమిషంలో మాత్రమే ఒక్క అల్లు అరవింద్ కు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం కల్పించారు.

ఆ సమయంలో లో నాగబాబు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించినా చిరంజీవి మాత్రం నాగబాబు కు టిక్కెట్టు ఇవ్వకుండా సమన్యాయం పాటించారు.కానీ ఈ విషయంలో జనసేన అధినేత మాత్రం న్యాయాన్ని పాటించడం లేదని తెలుస్తోంది.

పార్టీ కోసం ఇంతవరకు రవ్వంత కూడా కష్టపడని నాగబాబును నేరుగా రంగంలోకి దింపారు పవన్ కళ్యాణ్.అన్న కోసం పార్టీకి ముఖ్యమైన సిద్దంతాలని సైతం పక్కన పెట్టి మరీ అన్నకు రెడ్ కార్పెట్ పరిచిన పవన్ కళ్యాణ్ పార్టీలో లో టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఉందన్న విషయాన్ని మర్చిపోయారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.జనసేనలో చేరాలంటే అభ్యర్ధిగా టిక్కెట్టు సాధించాలంటే స్క్రీనింగ్ టెస్ట్ ముందు పాస్ అవ్వలంటూ సూక్తులు చెప్పిన పవన్ కళ్యాణ్ అన్న విషయంలో మాత్రం.

ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ లు పరీక్షలు లేకుండానే పార్టీలో టిక్కెట్టు కేటాయించి బీ ఫార్మ్ ఇవ్వడం సొంత పార్టీ నేతలకి షాక్ ఇచ్చారు.అసలు జనసేన పార్టీకి సిద్దాంతాలు ఉన్నాయా అనే సందేహాలు ఈ ఒక్క పరిణామంతో తేటతెల్లం అవుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు.అయితే పవన్ ఈ రకమైన నిర్ణయాల వలన ప్రజలకి ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తలకి పార్టీపై నమ్మకం పోతుందని అంటున్నారు విశ్లేషకులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube