వలస నాయకులు కలిసి రావడంలేదా...? జనసేనలో ఇంకా ఏం జరుగుతోంది ...?  

  • జనసేన లో ఇప్పుడు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఆ పార్టీకి బలమైన క్యాడర్… పవన్ గాలి ఉన్నా… బలమైన నాయకులు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో జనసేన బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.

  • Pawan Kalyan Bothering About Migration Leaders-Janasena Party Pawan Janasena Tdp Ycp Ys Jagan

    Pawan Kalyan Bothering About Migration Leaders

  • అయితే అధికార పార్టీ టిడిపి గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ తో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండగా… వైసిపి కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నట్లు అనేక సర్వేలు ద్వారా తేలడంతో ఆ పార్టీ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పరిస్థితి ఏంటి అనేది పార్టీలోనూ పెద్ద చర్చగా మారింది.

  • Pawan Kalyan Bothering About Migration Leaders-Janasena Party Pawan Janasena Tdp Ycp Ys Jagan
  • ఎలాగూ… గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం బాగానే ఉంటుంది. అక్కడ పవన్ సామజిక వర్గం వారి ప్రభావం , అభిమానులు ఇవన్నీ జనసేనకు బాగా కలిసి వస్తాయి. అయితే ముందు నుంచి ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏంటి పరిస్థితి అనేది చర్చకు వస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా పోరాట యాత్రకు అప్పట్లో మంచి స్పందన కనిపించింది. పవన్ ఎక్కడికి వెళ్ళినా జనం బాగా హాజరుకావడంతో ఈ జిల్లాలో పవన్ పార్టీ ఊపేస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే రాను రాను ఈ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. దీనికి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కూడా జనసేన ఊపు తగ్గించడానికి ఒక కారణం అయ్యింది అనే వాదన కూడా వినిపిస్తోంది.

  • మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు కలిగిన ఈ మూడు జిల్లాల్లో పవన్ సామాజిక వర్గంతో పాటు, మెగాభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాంతో బలీయమైన శక్తిగా జనసేన నిలుస్తుందని అనుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర మొదలయ్యాక వైసీపీ వైపుగా జనం మొగ్గు కనిపించింది. ఇక జనసేనలో పవన్ ఒక్కడే వన్ మాన్ షో లా ఉండగా… మరో నేత ప్రత్యామ్న్యాయంగా కనిపించడంలేదు.

  • దీంతో పవన్ పాదయాత్ర చేసిన తరువాత ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసి క్యాడర్ ను చేరదీసి నాయకుడు మరొకరు కనిపించడంలేదు. ఇక పార్టీలోకి వలస వస్తున్న నాయకుల వల్ల కూడా పవన్ కి పెద్దగా కలిసి రావడంలేదు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనలో రెండు నెలల క్రితం చేరారు. దీంతో పార్టీలోకి కొత్త ఊపు వస్తుంది అని భావించారు. అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఎటూ వెళ్లకుండా జనసేన లో చేరే విషయంలో వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అసలు చెప్పుకోదగిన స్థాయిలో ముఖ్య నేతలు ఎవరూ ఈ పార్టీలో కనిపించకపోవడంతో…గందగోళం నెలకొంది.