పవన్ అభిమానులు రెడీగా వుండండి రేపు అద్భుతాన్ని చూడబోతున్నారు.!

అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా! నిజమే.అలాగే అనిపిస్తుంది.

 Pawan Kalyan Fans Be Ready They Are Going To See The Miracle Tomorrow  Pawan Kal-TeluguStop.com

వారు పవర్ స్టార్ పైన ప్రకటించిన ప్రేమ తాలూక ఎఫెక్ట్ అలాంటిది మరి.పుట్టిన రోజుకి ముందే వారు అంతర్జాలంలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.బర్త్ డే విషెస్ ను రికార్డు స్థాయిలో కనబరిచిన విషయం మనకు తెలిసిందే.దాంతో మనం అర్ధం చేసుకోవచ్చు.ఆయనకు అభిమానులు ఏ స్థాయిలో వున్నారో అని.

మరే తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం ఇది.సరిగ్గా రెండేళ్ళ తరువాత పింక్ రీమేక్ చిత్రం వ‌కీల్ సాబ్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు.రాజకీయాల మూలంగా సినిమాలను చాలా అరుదుగా చేస్తుంటారు పవన్.

జనసేన పనులలో బిజీగా వుంటూ.తనకు ఖాళీగా వున్న సమయాన్ని సినిమాలకు కేటాయిస్తుంటారు పవర్ స్టార్.

ఇకపోతే వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వ‌కీల్ సాబ్ సినిమాకు లాక్ డౌన్ కార‌ణంగా తాత్కాలిక బ్రేక్ ప‌డింది.

మ‌రో వారం.

పది రోజులు షూటింగ్ మిగిలి ఉండ‌గా, వీలైనంత త్వ‌ర‌లోనే దానిని కూడా పూర్తి చేయాల‌ని నిర్మాతలు అనుకుంటున్నారు.ఇకపోతే రేపు పవర్ స్టార్ ‌పుట్టిన రోజు కాబ‌ట్టి, ఈ సంద‌ర్భంగా సదరు సినిమానుండి ఏదైనా స‌ర్‌ప్రైజ్ ఉంటే బావుంటుందని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

వారిని దృష్టిలో పెట్టుకొనే కొద్ది సేప‌టి క్రితం చిత్ర నిర్మాత‌లు బోని క‌పూర్, దిల్ రాజు రేపు ఉద‌యం 9గం.ల 9 నిమిషాల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్టు పేర్కొన్నారు.దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube