పవన్ కొత్త మూవీ స్టిల్ టాక్... కానీ అది కాదంటున్న ఫ్యాన్స్...

తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ఇటీవలే బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన “పింక్” చిత్రాన్ని తెలుగులో “వకీల్ సాబ్” పేరుతో రీమేక్ చేసి విడుదల చేయగా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

 Pawan Kalyan Bhimla Nayak Movie Stills Viral-TeluguStop.com

అంతేకాకుండా 85కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో మంచి విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా మరో హీరో రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.దీంతో పవర్ స్టార్ అభిమానులు మరియు రానా దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 Pawan Kalyan Bhimla Nayak Movie Stills Viral-పవన్ కొత్త మూవీ స్టిల్ టాక్… కానీ అది కాదంటున్న ఫ్యాన్స్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు మళ్ళీ మొదలయ్యాయని మరియు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఈ చిత్ర షూటింగ్ సెట్లో తీసిన స్టిల్ అంటూ కొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ దుస్తులు ధరించి నిలబడి ఉండగా రానా దగ్గుబాటి కుర్చీలో కూర్చుని కనిపించాడు.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోల పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ దుస్తులు ధరించి ఉండగా తీసిన ఫోటోలు అలాగే రానా దగ్గుబాటి హీరోగా నటించిన “నేనే రాజు నేనే మంత్రి” చిత్రంలోని కొన్ని ఫోటోలను తీసుకొని మార్ఫింగ్ చేసి ఎడిట్ చేశారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ యధావిధిగా సినిమాలు చేయడంతో అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా మలయాళంలో “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రం దాదాపుగా 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.అంతేకాకుండా ఈ చిత్ర ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.కాగా తెలుగులో ఈ రీమేక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలను అందిస్తున్నాడు.దీంతో ఈ చిత్రంపై మరిన్ని భారీ అంచనాలు నెలకొన్నాయి.

#Trivikram #Bhimla Nayak #Pawan Kalyan #PawanKalyan #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు