భీమ్లా టాక్‌ : థియేటర్ లో రష్యా ఉక్రెయిన్ యుద్దం చూశాం

పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది.పవన్ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.

 Pawan Kalyan Bheemla Nayak Public Talk ,pawan Kalyan ,  Public Talk, Tollywood,-TeluguStop.com

థియేటర్ల నుంచి బయటకు రావడానికి కూడా వారు ఇష్టపడటం లేదు.బయటకు వచ్చినా కూడా అదే మానియాలో బతికేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలి అనుకున్నారో అలాగే వారికి దర్శకుడు సాగర్ కే చంద్ర చూపించడంతో ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.భీమ్లా నాయక్‌ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇది ఒక చిన్న సినిమా.

రీమేక్ సినిమా అంటూ అంతా భావించారు.అయినా కూడా అంచనాలు భారీగా వచ్చాయి.

సినిమా విడుదల సమయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అయితే బాగుంటుంది అని అభిమానులు భావించారు.

కేవలం హిట్ కాదు సూపర్ హిట్ దక్కింది.

అద్భుతమైన మాస్ డైలాగులతో పవన్ కళ్యాణ్ మరియు రానా ల మధ్య అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇద్దరు హీరోల మధ్య ఉండే ఫైటింగ్ సన్నివేశాలు ఆహా అన్నట్టుగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఒక అభిమాని థియేటర్ నుంచి బయటికి వచ్చి ఒక మీడియాతో మాట్లాడుతూ థియేటర్ లోపల రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది.ఆ యుద్దాన్ని జనాలు భయంతో కాకుండా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు.

ఇది అభిమానులకు ఆనందం కలిగించే విషయం.అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక జాతర.పండుగ.ఉత్సవం అంటారు.అవన్నీ కూడా ఈ సినిమా ఇస్తుంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు సమ్మక్క సారక్క జాతర ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు భీమ్లా నాయక్‌ జాతర కూడా అదే స్థాయిలో జరుగుతుంది అంటూ అభిమానులు థియేటర్ బయట కోలాహలం చేస్తున్నారు.ఇదే కోలాహలం రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube