భీమ్లానాయక్‌ కోసం ఇంకా పవన్‌ ఎన్నాళ్లు ఇవ్వాలి!

Pawan Kalyan Bheemla Nayak Movie Shooting Update

పవన్ కళ్యాణ్‌ ఒక వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు వరుసగా సినిమాలు చేస్తున్నాడు.గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఒక్కో సినిమాకు నెల రెండు నెలల డేట్లు మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నాడు.

 Pawan Kalyan Bheemla Nayak Movie Shooting Update-TeluguStop.com

అందుకోసం దర్శక నిర్మాతలు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని పవన్‌ సూచిస్తున్నాడు.ఏ సినిమాకు అయినా కూడా రెండు మూడు నెలల కంటే ఎక్కువ డేట్లు ఇవ్వకూడదని పవన్‌ భావిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇక పవన్‌ భీమ్లా నాయక్‌ ఇప్పటికే ప్రారంభించి చాలా నెలలు అయ్యింది.కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు.

 Pawan Kalyan Bheemla Nayak Movie Shooting Update-భీమ్లానాయక్‌ కోసం ఇంకా పవన్‌ ఎన్నాళ్లు ఇవ్వాలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్‌ ఇప్పటి వరకు ఈ సినిమా కోసం 40 రోజుల వర్కిండ్‌ డేస్ ను కేటాయించాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 15 రోజులు షూటింగ్‌ కోసం కేటాయిస్తే సినిమా పూర్తి అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల చివరి నుండి మళ్లీ భీమ్లా నాయక్‌ సినిమా చిత్రీకరణ లో పవన్‌ పాల్గొంటాడు అంటున్నారు.వరుసగా వస్తున్న సినిమాలను పవన్‌ కాదనకుండా చేస్తున్నాడు.

కనుక సినిమాల సంఖ్య పవన్‌ భారీగా పెంచేస్తున్నాడు.ఇదే సమయంలో తక్కువ సమయంలోనే సినిమాలను ముగించాలనే పట్టుదలతో పవన్‌ ఉన్నాడు.

భీమ్లా నాయక్‌ ను వచ్చే నెలతో ముగించి ఆ వెంటనే హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Bheemla Nayak, Bheemla Nayak Shooting, Bheemla Nayak Shooting Update, Director Sagar K Chandra, Film News, Hari Hara Veeramallu, Pawan Kalyan-Movie

హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగం వరకు పూర్తి అయ్యింది.కనుక వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను ముగించాలని భావిస్తున్నారు.భీమ్లా నాయక్ కు 15 రోజులు కేటాయించబోతున్న పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు సినిమాకు మాత్రం నెలన్నర రోజుల పాటు డేట్లు కేటాయించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు కూడా ఒకటి సంక్రాంతికి.ఒకటి సమ్మర్ లో విడుదల కాబోతున్నాయి.

#Bheemla Nayak #Sagar Chandra #Bheemla Nayak #Pawan Kalyan #HariHara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube