పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది.ఫిబ్రవరి 25వ తారీకున ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా పలు సందర్బాల్లో వాయిదా పడింది.ఈసారి మాత్రం విడుదల తేదీ కన్ఫర్మ్ గా విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈనెల 18వ తారీకున ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా కు సంబంధించిన డబ్బింగ్ ను ఇటీవలే పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు.
ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్ ను విడుదల చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 21న భారీ ఎత్తు యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ లో నిర్వహించబోతున్నారట.అందుకోసం ఇప్పటికే సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలంగాణ పోలీసుల అనుమతి కోరుతూ లేఖ రాసిందట.
ఒకటి రెండు రోజుల్లో ఆ అనుమతులు వస్తాయని అంటున్నారు.సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి.దానికి తోడు ఈ సినిమా కు పోటీగా కూడా ఇతర సినిమాలు ఉన్నాయి.
కనుక ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకుండా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.అభిమానులు పెద్ద ఎత్తున హాజరు అయ్యే విదంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ నుండి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రం నుండి కూడా జనాలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటల సహకారం అందించాడు.అంతే కాకుండా కొన్ని కీలక సన్నివేశాలకు ఆయన దర్శకత్వం వహించాడని కూడా అంటున్నారు.దాంతో భీమ్లా నాయక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా లో నిత్యా మీనన్ పవన్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.రానా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.