వీడియో : బ్రేక్‌ లో తూటాల వర్షం కురిపించిన 'భీమ్లానాయక్‌'

పవన్‌ కళ్యాణ్ కు గన్స్ అంటే కాస్త ఎక్కువ ఇష్టం అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.తన సినిమాలో అవసరం ఉన్నా లేకున్నా కూడా గన్స్ ను పవన్‌ ఉపయోగిస్తాడు అనేది చాలా మంది అనే వ్యాఖ్య.

 Pawan Kalyan Bheemla Nayak Movie Break Time  , Bheemla Nayak , Tollywood ,  News-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గా నటిస్తే ఇక చెప్పనక్కర్లేదు.చేతిలో పెద్ద గన్ ఉండాల్సిందే.

ప్రస్తుతం భీమ్లా నాయక్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న పవన్‌ కళ్యాణ్‌ ఆ సినిమా షూటింగ్‌ గ్యాప్‌ లో ఇలా సరదాగా గన్‌ పట్టుకుని ఫొటోకు వీడియోలకు ఫోన్ లు ఇచ్చాడు.సాదారణంగా అయితే ఫొటోలకు పెద్దగా ఫోజు ఇచ్చేందుకు ఇష్టపడని పవన్‌ కళ్యాణ్ గన్ను చేతిలో పడిన వెంటనే ఓ రేంజ్ లో ఫోజ్‌ ఇచ్చాడు.

కాస్ట్యూమ్స్ కు గన్‌ కు సెట్‌ అవ్వకున్నా కూడా పవన్‌ తనదైన శైలిలో గన్ పట్టుకుని ఆకట్టుకున్నాడు.

పవన్‌ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ గ్యాప్ లో ఇలా స్టైల్‌ చూపించాడు అంటూ సితార ఎంటర్‌ టైన్ మెంట్స్ వారు ఈ వీడియోను షేర్‌ చేయడం జరిగింది.

ప్రస్తుతం యూట్యూబ్‌ లో ఈ వీడియో ట్రెండ్డింగ్‌ లో ఉంది.పవన్‌ కళ్యాణ్ నుండి ఎలాంటి వీడియో వచ్చినా కూడా ట్రెండ్‌ అవ్వడం చాలా కామన్‌ విషయం.

కనుక ఈ వీడియో ను అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.ప్రస్తుతం వీడియోకు సంబంధించిన స్టిల్స్ మరియు స్క్రీన్‌ షాట్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు.ఇక వాట్సప్‌ లో కూడా ఈ వీడియోను అభిమానులు తెగ పంచుకుంటున్నారు.పవన్ కళ్యాన్‌ ను మళ్లీ ఇలా చూడాలనుకుని చాలా మంది అనుకున్నారు.అనుకున్నట్లుగా ఆయన కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube