వారాహి ఏలూరు సభ( Varahi Eluru Sabha ) నుంచి తాను చేసిన వాఖ్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చనీయాంశంగా మారారు.వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) పై ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలోనూ సామాన్య ప్రజనికంలోనూ తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.
పవన్ పై వ్యతిరేకంగానూ అనుకూలంగానూ మీడియా డిబేట్లు నిర్వహిస్తూ ఈ అంశాన్ని లైవ్లో ఉండే విధంగా చూస్తుంది సాదారణ ప్రజానీకం కూడా పవన్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయారంటే ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఏ స్థాయిలో ముద్ర వేశారో అర్థమవుతుంది.
తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం చాలా విషయాలలో కళ్ళు మూసుకు వెళ్లిపోతున్న రాజకీయ వ్యవస్థను( Political system ) తన వ్యాఖ్యల ద్వారా ఆయన తట్టి లేపినట్లు అయింది.ప్రజలకి నష్టం జరుగుతున్న విషయాలలో మనకు నష్టం వస్తుంది అని వూరుకుంటే అదీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని , అతి సున్నితమైన సమాచారాన్ని అనధికారిక ఛానల్ ద్వారా సేకరిస్తున్న ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుతో ఆటలాడుతుందని, సంఘవిద్రోహశక్తులకు ఆ సమాచారం చేరితే ప్రజల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందన్న ఆలోచనతోనే తాను మాట్లాడుతున్నానని తన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని తనపై ఎంతమంది ఎన్ని రకాల దాడులు చేయాలనుకున్నా తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో కి వచ్చానని ప్రకటించిన పవన్ తాను నికార్సయిన మాస్ లీడర్ నని నిరూపించుకున్నారు.
మంచి కొ చెడుకో తాను నమ్మిన దానిపై బలంగా నిలబడి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఒక వ్యవస్థపై ఒక బలమైన చర్చను లేవదీశారని చెప్పవచ్చు.వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచి జరుగుతుంది అన్నది వాస్తవం కానీ అదే సమయం లో వారు సేకరిస్తూన సమాచారానికి జవాబు ఎవరు అన్నది పెద్ద ప్రశ్న .తమ సమాచారాన్ని వాలంటీర్లకు అందిస్తున్న ప్రజలభద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు లేవనెత్తే విధంగా పవన్ చర్చను లేవదీశారు.రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పై దాడి చేయడం మానేసి ఒక బాధ్యత గల జవాబు దారి వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేయగలిగితే అప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది.ఏది ఏమైనా విమర్శలకు జడిసి తన మాటలు వక్రీకరించారని లేక తన ఉద్దేశం అది కాదని పక్కకు తప్పుకోకుండా తాను బలంగా ఈ విషయంలో బడి ఉన్నానన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ తనని ఒక మాస్ లీడర్ గా నిరూపించుకున్నారని చెప్పవచ్చు .