ఏపీకి ఫ్యూచర్ ఛాయస్ పవన్ కళ్యాణ్ కానున్నాడా  

Pawan Kalyan Become A Ap Feature Choice -

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ముఖ్యంగా వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య నడుస్తుంది.మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ ఈ ఎన్నికలలో ఏ మేరకు సత్తా చూపిస్తుంది అనేది ప్రస్తుతానికి ఎవరు చెప్పలేకపోతున్నారు.

Pawan Kalyan Become A Ap Feature Choice

అయితే కచ్చితంగా ఏపీలో 2019 ఎవరు అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే టీడీపీ పవన్ కళ్యాణ్ తో రాజకీయం మొదలెట్టింది అనే మాట వినిపిస్తుంది.

ఇక వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఒప్పుకొని వారి మద్దతుని సొంతం చేసుకోవాలని అనుకున్న విజయసాయి రెడ్డి విమర్శల నేపధ్యంలో వైసీపీ, జనసేన మధ్య అంతరం పెరిగిపోయింది అనే మాట వినిపిస్తుంది.

అయితే తామే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతోనే వైసీపీ జనసేనని టార్గెట్ చేసింది అనే మాటలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎలా అయిన వైసీపీకి అధికారం దూరం చేయడానికి పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకోవడానికి తనదైన రాజకీయ చతురతని నడిపిస్తున్నాడు అనే మాట రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.అయితే వైసీపీ తన ఫ్యూచర్ శత్రువుగా జనసేనని చూస్తుంది అని, ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ, జనసేనని లక్ష్యంగా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఇదే పంథాలో ఈ ఐదేళ్ళు ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తే రాబోయే ఏపీ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ తో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Become A Ap Feature Choice- Related Telugu News,Photos/Pics,Images..