చంద్రబాబు కి దేబ్బేసిన బాలకృష్ణ ,పవన్ కళ్యాణ్     2018-04-21   04:56:46  IST  Bhanu C

-

-

ఆరుపదుల వయసులో పోరాట యోధుడిలా తన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేంద్రంపై ధర్మ యుద్ధం ప్రకటించిన చంద్రబాబు నాయుడు..ఎన్నో నిరసనలు చేపట్టారు ఎక్కాడా కూడా ఒక ముఖ్య మంత్రి తన రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన దాఖలాలు లేవు కానీ చరిత్రలో మొదటి సారిగా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం విజయవాడలో ధర్మ దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకి అన్ని వర్గాలు కూడా హాజరయ్యి తమ సంఘీభావం తెలిపారు ఎంతో మంది మేధావులు చంద్రబాబు ని కలిసి మద్దతు తెలిపారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఈ రకమైన నిరసనలు తెలిపారు అయితే ఈ దీక్షతో చంద్రబాబు ఇమేజ్ పీక్ కి వెళ్ళిపోతుంది అని ఊహించుకున్న చంద్రబాబు ఆశలపై తన సొంత బావ మరిది బాలయ్య నీళ్ళు చల్లారు..

అంతేకాదు పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబు స్కెచ్ అంతా మొత్తంగా తుడిచి పెట్టుకు పోయింది చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమం ఏమేరకు విజయవంతం అయిందో తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది…ఎందుకంటే నిన్న చంద్రబాబు చేపట్టిన దీక్ష సమయంలోనే పోఅవన్ కళ్యాణ్ మా దగ్గర తెగ హడావిడి చేశారు..దాంతో మీడియా ఫోకస్ మొత్తం దాని మీదే నిలిచింది. సోషల్ మీడియాలో సైతం పవన్ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది…దాంతో ధర్మ పోరాట దీక్షకు ఆశించినంత మీడియా కవరేజీ దక్కలేదు. దీక్షకు జనాల నుంచి స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది.