అయ్యప్పన్ కోషియమ్ లో పవన్ కళ్యాణ్… కన్ఫర్మ్ చేసిన సితార  

Pawan Kalyan Ayyappanum koshiyum Remake Confirmed, Tollywood, Telugu Cinema, Sitara Entertainments, Rana, Sagar K Chandra - Telugu Ayyappanum Koshiyum Remake, Pawan Kalyan, Rana, Sagar K Chandra, Sitara Entertainments, Telugu Cinema, Tollywood

చాలా రోజుల నుంచి మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమా గురించి టాలీవుడ్ ఆసక్తికర చర్చ నడుస్తుంది.మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ తెలుగులో రిమేక్ చేయబోతుంది.

TeluguStop.com - Pawan Kalyan Ayyappanum Koshiyum Remake Confirmed

ఈ నేపధ్యంలో ఇందులో ముందుగా బాలకృష్ణ, రవితేజ నటిస్తారని టాక్ వినిపించింది.తరువాత రానా, రవితేజ కాంబినేషన్ అని చర్చ నడిచింది.

తరువాత పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది.అయితే పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టి ఉంచడంతో ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయాడని టాక్ నడిచింది అయితే సితార వాళ్ళు త్రివిక్రమ్ ద్వారా మళ్ళీ సంప్రదింపులు జరిపించి ఒప్పించినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - అయ్యప్పన్ కోషియమ్ లో పవన్ కళ్యాణ్… కన్ఫర్మ్ చేసిన సితార-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు దసరా సందర్భంగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.

దసరా సందర్భంగా మెగా, పవర్ స్టార్ అభిమానులకి పండగలాంటి వార్తని ఒక వీడియో ద్వారా కన్ఫర్మ్ చేసింది.

ఇందులో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని వీడియో బట్టి క్లారిటీ వచ్చింది.ఇక అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఇక ఈ సినిమాలో మరో పాత్రలో రానా కనిపిస్తాడని తెలుస్తుంది.మొత్తానికి వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ ఏ సినిమా ముందు స్టార్ట్ చేస్తాడో తెలియదు కానీ వరుసగా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, ఇప్పుడు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ తో నాలుగు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ లైన్ లో పెట్టేశాడు.

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సినిమా ఉంటే ఇక దీనిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది.

క్రిష్ సినిమా కంటే ముందుగానే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

#Sagar K Chandra #Rana #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Ayyappanum Koshiyum Remake Confirmed Related Telugu News,Photos/Pics,Images..