సినిమాలకు దూరం.. సినిమా వారికి చేరువగా       2018-05-09   03:02:45  IST  Raghu V

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్‌ కళ్యాణ్‌ వీలున్నప్పుడల్లా సినిమా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తనకు ఇంతటి క్రేజ్‌ను ఇచ్చిన సినిమా పరిశ్రమను వదిలేయడం ఇష్టం లేకనే పవన్‌ సినిమాలు చేయకున్నా కూడా సినిమా పరిశ్రమలో జరుగుతున్న కార్యక్రమాల్లో హాజరు అవ్వడం, సినిమా వేడుకల్లో పాల్గొని చిత్ర యూనిట్‌ సభ్యులకు అభినందనలు తెలియజేయడం చేస్తున్నాడు. పవన్‌ మద్య కాలంలో వరుసగా సినిమా కార్యక్రమాల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు ఆశ్చర్యంను కలిగిస్తున్నాడు.

పవన్‌ హీరోగా చేసే సమయంలో ఇతర హీరోల సినిమాల వేడుకల్లో పాల్గొనడం లేదా అసలు సినిమాలు చూడకపోవడం చేసేవాడు. కాని సుదీర్ఘ కాలం తర్వాత పవన్‌ తన అన్న కొడుకు రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం చిత్రాన్ని థియేటర్‌లో చూడటం జరిగింది. ఆ సినిమా బాగా నచ్చడంతో అప్పుడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత సక్సెస్‌ మీట్‌లో పవన్‌ పాల్గొని చిత్ర యూనిట్‌ సభ్యులకు తన తరపున అభినందనలు తెలియజేశాడు. తాజాగా మళ్లీ మళ్లీ కూడా సినిమా వేడుకల్లో కనిపించేందుకు ఓకే చెప్పాడు, రెండు సినిమా వేడుకల్లో పవన్‌ పాల్గొనబోతున్నాడు.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలై పర్వాలేదన్నట్లుగా వసూళ్లు సాధిస్తుంది. ఈమద్య సినిమా సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా థ్యాంక్స్‌ మీట్‌లు చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రం కోసం కూడా థ్యాంక్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించబోతున్న థ్యాంక్స్‌ మీట్‌లో పవన్‌ పాల్గొనబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. పవన్‌ రానున్న నేపథ్యంలో కార్యక్రమం స్థాయి మరింతగా పెరిగింది. ఇక రవితేజ నటిస్తున్న నేటికెట్‌ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కూడా పవన్‌ పాల్గొనబోతున్నాడు. ఈ రెండు కూడా ఒక రోజు అవ్వడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశను కలిగిస్తున్నాయి.

సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించని పవన్‌ ఇలా సినీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సినిమా ఇండస్ట్రీ వారితో మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఉంటుందని భావిస్తున్నాడు. దానికి తోడు తన ఆప్తుల సినిమాలు అవ్వడం వల్ల కూడా ఇలా కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు. నా పేరు సూర్య చిత్రాన్ని నిర్మించింది నాగబాబు. ఆ కారణంగానే పవన్‌ థ్యాంక్స్‌ మీట్‌కు రాబోతున్నాడు. ఇక నేలటికెట్‌ చిత్ర నిర్మాతకు పవన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగా ముందుకు వస్తున్నాడు. సినిమాలకు దూరంగా ఉంటున్నా, ఇలా సినిమా పరిశ్రమకు పవన్‌ దగ్గరగా ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.