త్రివిక్రమ్‌నే నమ్ముకున్న పవన్.. చివరకు ఇలా!  

Pawan Kalyan Asks Trivikram To Write Script - Telugu Pawan Kalyan, Pink Remake, Script, Telugu Movie News, Trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న పవన్, అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan Asks Trivikram To Write Script

ఈ సినిమాలో పవన్ లాయర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా అంటే అవుననే సమాధానం మాత్రం మెజారిటీ ఆడియెన్స్‌ను రావడం లేదు.

దీనికి కారణం కూడా ఉంది.ఇదొక రీమేక్ సినిమా కావడం, కమర్షియల్ అంశాలు లేకపోవడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి.ఇక క్రిష్ దర్శకత్వంలో రానున్న సినిమా కూడా పీరియాడికల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా కూడా మాస్ జనాలను ఎంతవరకు ఆకట్టుకుందో అనే గ్యారెంటీ కూడా పవన్‌కు లేదట.దీంతో తనకు అదిరిపోయే ఇండస్ట్రీ హిట్‌లు అందించిన తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడు.

అందుకే త్రివిక్రమ్‌ను ఓ అదిరిపోయే కథను రెడీ చేయాలని పవన్ కోరాడట.

దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పి పవన్‌ రేంజ్‌ను పెంచే అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేయడానికి పూనుకున్నాడట త్రివిక్రమ్.

మొత్తానికి త్రివిక్రమ్ మాత్రమే తనకు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందించగలడని పవన్ భావించి తనకు పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేయాల్సిందిగా కోరడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

తాజా వార్తలు