ఏంటి ఈ ఫ్లెక్సీల గోల ..? జనసేనాని ఆరా !   Pawan Kalyan Asked About Flexi Disputes In Vijayawada     2018-11-07   21:18:55  IST  Sai M

బెజవాడలో రాజకీయ దుమారం రేగింది. టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య వివాదం కాస్తా ఫ్లెక్సీల రూపంలో ఇప్పుడు బెజవాడ వాసులకు దర్శనం ఇస్తున్నాయి. పవన్ తూర్పుగోదావరి పర్యటనలో టీడీపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఆధ్వర్యంలో పవన్ ని ప్రశ్నిస్తూ భారీ ఫ్లెక్సీయేలను విజయవాడ నది బొడ్డున ఏర్పాటు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

దీనికి కౌంటర్‌గా జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేష్ ఆధ్వర్యంలో బెజవాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పచ్చ తమ్ముళ్ల పిచ్చ పురాణం, వెంటాడుతున్న ఓటమి భయం, టీడీపీని ఓడించే జన సైనికులం అంటూ’ ఘాటు వ్యాఖ్యలతో ఈ ఫ్లెక్సీలను రూపొందించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లెక్సీల గోల ఏంటి అంటూ జనసేన అధినేత పవన్ పార్టీ నాయకులను ఆరా తీసినట్టు సమాచారం.