విరూపాక్ష వెనకాల ఉన్న వీర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

 Pawan Kalyan As Veera For Viroopaksha, Pawan Kalyan, Viroopaksha, Krish, Tollywo-TeluguStop.com

ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు.

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుక రెడీ అయ్యాడు.ఈ సినిమాను తమిళ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటించేందుక సిద్ధమయ్యాడు.

ఈ సినిమాలో అతడి పాత్ర పేరు ‘వీర’గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఉన్నవారి దగ్గర దోచుకుని లేనివారికి పంచిపెట్టే పాత్రలో పవన్ కనిపిస్తుండటంతో ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో పవన్ పేరు నిజంగానే ‘వీర’గా ఉండనుందా అనేది చూడలి.

కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను సెప్టెంబర్ 2న రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube