ఏ ముహూర్తాన ‘గబ్బర్‌సింగ్ 2’ అనుకున్నారో కాని, రెండు సంవత్సరాల నుండి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఈ సినిమా పరిస్థితి ఉంది.మొదట దర్శకుడిని మార్చారు, సంగీత దర్శకుడిని మార్చారు, హీరోయిన్ను మార్చారు, స్క్రిప్ట్‌ను మార్చారు ఇలా ఎన్నో ఈ రెండు సంవత్సరాలుగా మార్చుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్‌నే మార్చేశారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఇంత కాలం ‘గబ్బర్‌సింగ్ 2’ ఉన్న టైటిల్‌ను ‘సర్దార్’గా మార్చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్‌గా కనిపించనున్నాడు.ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దం అయ్యింది.
మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది.ఇక రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ఈనెల చివరి వారంలో ప్రారంభం కాబోతుంది.
పవన్ కళ్యాణ్ ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొని షూటింగ్ పూర్తి అయ్యే వరకు కొనసాగించే అవకాశాున్నాయి.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలతో ప్రెస్‌నోట్‌ను విడుదల చేసేందుకు నిర్మాత శరత్ మారార్ ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.