పవన్ కళ్యాణ్ ని సంచారిగా చూపించబోతున్న హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే పోజిటివ్ బజ్ నడుస్తుంది.

 Pawan Kalyan As Sanchari For Harish Shankar Movie-TeluguStop.com

ఈ నేపధ్యంలో సినిమా సూపర్ హిట్ పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తుంది.దిల్ రాజు కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆయన ప్రమోషన్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నాడు.

 Pawan Kalyan As Sanchari For Harish Shankar Movie-పవన్ కళ్యాణ్ ని సంచారిగా చూపించబోతున్న హరీష్ శంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిపొయింది.

ఇక ఇప్పటికే హరీష్ శంకర్ ఈ సినిమాకి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ లో బైక్, పెదబాలశిక్ష, పువ్వు, బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ గేటు చూపించి తన సినిమా కాన్సెప్ట్ వాటితో లింక్ అయ్యి ఉంటుందని చెప్పకనే చెప్పాడు.గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిమీద ఎప్పటిలాగే భారీ అంచనాలు ఉంటాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ ని హరీష్ ఫిక్స్ చేశాడని ఆ న్యూస్ సారాంశం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ ట్రావెలర్ గా కనిపిస్తాడని, ఈ కారణంగానే సినిమాకి సంచారి అనే టైటిల్ నిర్నయించారనే మాట బలంగా వినిపిస్తుంది.

#Director Krish #Pawan Kalyan #MythriMovie #Sanchari #HarishShankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు