భీమ్లా నాయక్ గా పవన్‌.. 'ఏకే' రీమేక్‌ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

పవన్‌ కళ్యాణ్‌ ఎట్టకేలకు షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు. సెకండ్‌ వేవ్‌ కు ముందే పవన్‌ కళ్యాణ్‌ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.

 Pawan Kalyan As Bheemla Nayak In Ak Movie-TeluguStop.com

వకీల్‌ సాబ్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల సందర్బంగా పవన్‌ కళ్యాన్‌ కరోనా బారిన పడ్డాడు.కరోనా నుండి కోలుకున్న తర్వాత సెకండ్‌ వేవ్‌ కారణంగా లాక్‌ డౌన్ విధించారు.

దాంతో షూటింగ్ లకు సాధ్యం కాలేదు.ఇక ఈనెల ఆరంభంలో అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను మొదలు పెట్టాలని పవన్‌ భావించాడు.

 Pawan Kalyan As Bheemla Nayak In Ak Movie-భీమ్లా నాయక్ గా పవన్‌.. ఏకే’ రీమేక్‌ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా సినిమాటోగ్రాఫర్‌ తప్పుకోవడంతో సినిమా షూటింగ్‌ పునః ప్రారంభంకు కాస్త డిలే అయ్యింది.ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ను నేటి నుండి పునః ప్రారంభించినట్లుగా ప్రకటించారు.

సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించినట్లుగా ప్రకటించడంతో పాటు సినిమాకు సంబంధించిన కీలక అంశాలను క్లారిటీ ఇచ్చారు.

Telugu #bheemlanayak, Ak Movie, Bheemla Naik, Film News, Pawan As Bheemla Naik, Pawan Kalyan, Rana-Movie

సినిమాలో పవన్‌ పోలీస్‌ గా కనిపించబోతున్నాడు అంటూ చెప్పడంతో పాటు భీమ్లా నాయక్‌ అనే పాత్ర లో ఆయన నటిస్తున్నట్లుగా చెప్పేశారు.షూటింగ్‌ ను పునః ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు అతి త్వరలోనే గుమ్మడి కాయ కొట్టేస్తారని సమాచారం అందుతోంది.వచ్చే నెలలోనే సినిమాను ముగిస్తామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఇదే ఏడాదిలో చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మొత్తానికి ఏకే రీమేక్ కు సంబంధించినంత వరకు షూటింగ్ ను ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పూర్తి చేసి సినిమా ను డిసెంబర్‌ వరకు అయినా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చేస్తున్న పవన్‌ ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్‌ అవ్వబోతున్నారు.

#Pawan Kalyan #PawanAs #Bheemla Naik ##BheemlaNayak #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు