ఫ్యూజులు ఔటయ్యే న్యూస్.. పాకిస్థాన్‌లో పవన్ ఆర్మీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన సినిమా వస్తుందంటే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా థియేటర్లకు పరుగులు తీస్తారు.

 Pawan Kalyan Army In Pakistan, Pawan Kalyan, Pak Pspk, Pakistan, Twitter, Tollyw-TeluguStop.com

అత్యంత ఎక్కువ ఫాన్ బేస్ ఉన్న హీరోగా పవన్‌కు రికార్డు ఉంది.అయితే పవన్ కళ్యాణ్‌కు కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.

కాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీలు ఎన్ని ఉన్నాయో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.కానీ ఎవరి ఊహలకు అందకుండా తాజాగా ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ పేరిట ఓ ఫ్యాన్ పేజీ క్రియేట్ అయ్యింది.

ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు.భారతదేశ చిరకాల ప్రత్యర్థి దేశం అయిన పాకిస్థాన్ నుండి పవన్ కళ్యాణ్ ఆర్మీ అంటూ ట్విట్టర్‌లో ఓ పేజీ ప్రత్యక్షమయ్యింది.

ఎట్టకేలకు తమకు ట్విట్టర్‌లో ఓ ఫ్యాన్ పేజీ ఉందని సదరు ఫ్యాన్ పేజీ వారు సంతోషం వ్యక్తం చేశారు.అంతేగాక పవన్ కళ్యాణ్ సినిమా కోసం తామంతా వెయిట్ చేస్తున్నామంటూ హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యా్గ్ చేశారు.

దీంతో పవన్ అభిమానుల్లో కలవరం మొదలైంది.ఇది నిజంగా పవన్ అభిమానుల పేజీ అయితే వారు పోలీసులను ఎందుకు ట్యాగ్ చేశారని ఆలోచిస్తున్నారు.

అటు పోలీసులు కూడా ఈ ఫ్యాన్ పేజీకి సంబంధించి ఆరా తీస్తున్నారు.ఇది ఎక్కడి నుండి నడిపిస్తున్నారనే అంశంపై వారు కూపీ లాగుతున్నారు.

పాకిస్థాన్ లాంటి దేశంలో కూడా పవన్ అభిమానులు ఉన్నారని సంతోషించాలో, లేక పోలీసులతో చెలగాటం ఆడేందుకే ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారా అని పవన్ అభిమానులు అయోమయంలో పడ్డారు.ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube