సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్..డిసైడ్ చేసింది ఎవరంటే.       2018-07-02   02:53:08  IST  Bhanu C

2019 ఎన్నికల్లో ఏపీలో ఒక మహా కూటమి రాబోతోందని ఆకూటమిని కాపు కాసే సత్తా పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని అంటున్నారు సీపీఐ రాష్ట్ర నేత రామకృష్ణ..అంతేకాదు మా సీఎం అభ్యర్ధిగా పవన కళ్యాణ్ ఉంటారని ఆయన డిసైడ్ చేసేశారు..ఈ ప్రకటనతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో కుదుపు మొదలయ్యింది ఇప్పటి వరకూ ఒక క్లారిటీ తో ఉన్న నేతలలో ఈ కూటమి ప్రకటన కలకలం రేపుతోంది..చాలా మంది నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న తరుణంలో మళ్ళీ ఈ ప్రకటన పూర్తి సందిగ్ధత లోకి నెట్టేసింది. వివరాలలోకి వెళ్తే ..

కర్నూల్ జిల్లా ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం విలేఖరులతో మాట్లాడిన ఆయన పలు కీలక అంశాలపై కూడా కామెంట్స్ చేశారు..పవన్ కళ్యాణ్ కి ప్రజలలో బాగా క్రేజ్ ఉందని క్లీన్ ఇమేజ్ ఉందని రెండూ ఉన్న నాయకుడు దొరకరం చాలా అరుదని అందుకే అలాంటి లక్షణాలు ఉన్న నేత సీఎం అభ్యర్ధిగా ఉంటే పూర్తి న్యాయం జరుగుతుందనే నమ్మకం అందరిలో ఉందని..బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయగల దమ్ము అంతటి మనసు పవన్ లో మాత్రమే మేము చూశామని అంటున్నారు సీపీఐ నేతలు.
అయితే గాలి జనార్దన్‌ రెడ్డి తనకు రెండేళ్ల సమయం ఇస్తే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని..కన్నా కేంద్రాన్ని వెనకేసుకుని రాష్ట్రాభివృద్ధికి 85 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు..అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలకి ప్రజలే బుద్ది చెప్తారని పరోక్షంగా వైసీపికి వారినింగ్ ఇచ్చారు రామకృష్ణ..అయితే ఈ మహా కూటమి గురించి రామకృష్ణ చేసిన కామెంట్స్ ఒక్క సారి పరిశీలిస్తే ఎవరికీ అంతుబట్టని విధంగా ఉన్నాయి..ఎలా అంటే..

ఒక పక్క వామపక్షాలకి బీజేపి అంటే పడదు..మరో పక్క వైసీపి ,తెలుగుదేశం ఆ కూటమిలో ఉండవు ఇక మిగిలింది సీపీఐ ,సీపీఎం, ఇంకా జనసేన అప్పటికి జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెడితే ఆ పార్టీ అయితే ఇప్పడు ఈ మూడు పార్టీలతో కూటమి కట్టి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ని నిలబెట్టడం ప్రజలు లేని రాజ్యానికి ప్రభువుగా ఉన్నట్టుగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు..అయితే ఈ మాత్రం తెలియకుండానే రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారా..? అంటే ఏమో ఆయన మైండ్ లో ఏముందో కూటమి మొదలయ్యే సమయానికి ఏదన్నా అధ్బుతం జరుగుతుందేమో అంటున్నారు సీనియర్ నేతలు..ఏది ఏమినా ఇప్పుడు కూటమి సీఎం అభ్యర్ధి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.