చిల్లర రాజకీయాలు ఆపండి... అధికార పార్టీకి పవన్ హితవు

ఈ మధ్య కాలంలో ఏపీలో కరోనా కేసులు ఓ వైపు పెరిగిపోతూ ఉన్న కూడా రాజకీయ పార్టీలు ఆ కరోనాపై ప్రజలని అప్రమత్తం చేయడం, కరోనా నియంత్రణ చర్యలలో అధికార పార్టీకి అండగా నిలబడటం చేయకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజల భాగోగులు పక్కన పెట్టి కేవలం తమ స్వప్రయోజనాలు అనే విధంగా రాజకీయ నాయకులు అందరూ వ్యవహరిస్తున్నారు.

 Pawan Kalyan Sweat Warning To All Party Leaders, Ap Politics, Janasena, Bjp, Ysr-TeluguStop.com

ఓ వైపు ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద ప్రతి చిన్న విషయానికి విమర్శలు చేస్తూ తప్పులని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి.మరో వైపు అధికార పార్టీ వ్యవహారం కూడా ఇలాగే ఉంది.

కరోనాపై నియంత్రణపై చర్యలు, ప్రజలని రక్షణ కల్పించే పని పక్కన పెట్టి కేవలం ప్రచారానికి పరిమితం అవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాగే ఈ సమయంలో కూడా ఎన్నికల కమిషనర్ ని మార్చడం, ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మీడియా దుమ్మెత్తిపోయడం, విశాఖ రాజధాని గురించి చర్చించడం, అలాగే కరోనా నియంత్రణపై దృష్టి పెట్టమని సలహాలు ఇచ్చే వారిపై ఎదురుదాడి చేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు.ఈ సమయం చిల్లర రాజకీయాలు చేయడం ఆపేసి కరోనాపై జాగ్రత్తలు తీసుకునే చర్యలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.

సలహాలు ఇచ్చేవారిపైన, తప్పులని ఎత్తిచూపే వారిపై అధికార పార్టీ అదేపనిగా ఎదురుదాడి చేసి చేయడం ఆపి, రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసులని అదుపు చేసే ప్రయత్నం చేయాలని, అలాగే ఉపాధి కోల్పోయిన వలస కూలీలని ఆదుకోవాలని కోరారు.ఇలాంటి సమయంలో జనసేన తరుపున కోరేది ఒకటే.

రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా వదిలెంత వరకు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి కలిసి సమస్యలు పరిష్కారం మీద దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube