జనసేన- వైసీపీ పొత్తు : కింది స్థాయిలో ఈ చర్చ జరుగుతోందా ...?   Pawan Kalyan And YS Jagan Will Tie Up In Elections 219     2018-11-05   13:53:27  IST  Sai M

గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ చర్చ గా మారిన జనసేన వైసిపి పొత్తు గురించి ఎప్పటికీ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. జనసేన వైసిపి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది. ఆ తరువాత వైసీపీని పొత్తు కోసం జనసేన వెంట పడుతుందని ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో క్లారిటీ మాత్రమే రావాల్సి ఉందని ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. అయితే అసలు ఈ పొత్తు ఉన్నా లేకపోయినా వైసీపీ జనసేన నాయకులు ఈ వ్యవహారంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పొత్తు అయితే ఈ రెండు పార్టీల మధ్య ఖచ్చితంగా ఉంటుందని, అందుకే కొద్దికాలంగా జనసేన వైసీపీ ల మధ్య పరస్పర విమర్శలు తగ్గాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ విషయంలో వైసీపీ కింది స్థాయి నాయకుల మాటలు పరిగణలోకి తీసుకుంటే… పొత్తు విషయంలో జగన్ అంత సానుకూలంగా లేడని.. ఒంటరిగానే… సత్తా చాటాని జగన్ భావిస్తున్నాడని వారు చెప్పుకొస్తున్నారు. ఇక పొత్తు పట్ల వైసీపీలోని కాపు నేతలు, పవన్ మీద ఎంతో కొంత అభిమానం ఉన్న వాళ్లు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఎక్కువ సీట్లు కాదు.. కనీసం ఇరవై సీట్లు అయినా జనసేనకు ఇచ్చి పొత్తు పెట్టుకుంటాడని కొంతమంది వైసీపీ నాయకులు చెబుతున్నారు. జగన్ పవన్ వేర్వేరుగా పోటీ చేసినా.. వైసీపీకే లాభం ఎక్కువ ఉంటుంది, ఒకవేళ జనసేనతో పొత్తు కూడా పెట్టుకుని పోతే ఇక తిరుగే ఉండదు. ఏపీలో వైసీపీ జండా రెపరెపలాడడం ఖాయం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Pawan Kalyan And YS Jagan Will Tie Up In Elections 219-

అయితే ఈ పొత్తు విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నా… జగన్ సానుకూలంగా లేడని.. పొత్తు పెట్టుకుని గెలిస్తే ఆ తరువాత పవన్ తమ మీద పెత్తనం చేయడంతో పాటు నావల్లే జగన్ గెలిచాడు అంటూ చెప్పుకుని జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తాడు అంటూ టీడీపీ మీద పవన్ చేస్తున్న వ్యాఖ్యలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అందుకే తమ పార్టీ పొత్తుల పట్ల ఏ మాత్రం ఆసక్తితో లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే… పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా గెలిచినా తరువాత జగన్ సీఎం అవుతాడని … అప్పుడు మా నాయకుడి పరిస్థితి ఏంటి ఆయన జగన్ కింద పనిచేయాలా ..? అంత అవసరం మాకేంటి ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళ్లి మా సత్తా చుపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు.