పవన్ - జగన్ : ఆ విషయం పై ఇంత చర్చ అవసరమా ..?     2018-12-04   15:05:10  IST  Sai M

గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ హడావుడి చేసేస్తున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారిపోయారు. ఒకపక్కన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి.పార్టీల నాయకులంతా ఒకరిని ఒకరు దూషించుకోవడానికే సమయం లేదు అన్నట్టుగా… హడావుడి చేసేస్తున్నారు. ఈ సమయంలో ఆ విషయాలు ఏవీ తమకు సంబంధం లేదు అన్నట్టుగా… ఏపీలో జగన్ పవన్ లు ఇద్దరూ …ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల బేరం కుదురుతోంది అనుకుంటున్న సమయంలో ఇలా… విమర్శలు చేసుకోవడం చూస్తుంటే… మా మధ్య స్నేహం లేదు వైరమే అని ప్రకటించుకునే సూచనలుగా ఇవి ఉన్నట్టు అర్ధం అవుతోంది.

Pawan Kalyan And YS Jagan Why You Are Discussing On That Matter-Elections In AP Janasena YCP

ఇప్పుడు ఏపీలో.. మగతనం గురించి జగన్ – పవన్ ఇద్దరూ… చర్చ మొదలు పెట్టారు. నీ మగతనం ఎంతంటే.. నీ మగతనం ఎంత అని.. బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు.అసెంబ్లీని వెళ్లి పోరాడలేని జగన్మోహన్ రెడ్డికి మగతనం ఉందా.. అని కొద్ది రోజుల కిందట పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పోరాటయాత్రలో తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా నిన్నటి రాజాం పాదయాత్రలో పవన్ మగతనం గురించి.. సూటిగా ప్రశ్నలు సంధించారు. కార్లు మార్చినట్టు భార్యలను మార్చడం మగతనమా..? ఒకరితో కాపురం చేస్తూనే మరొకరితో పిల్లలను కనడం మగతనమా?. రేణూ దేశాయ్‌ని నీ అభిమానులు దూషిస్తున్నా మౌనంగా ఉండటం మగతనమా ?. తప్పు ఎత్తిచూపిన వారి ఇళ్లలోని ఆడాళ్లపై తప్పుడు పోస్టింగ్‌లు పెట్టించడం మగతనమా? అంటూ.. జగన్ సంచలన విమర్శలు చేశారు.

Pawan Kalyan And YS Jagan Why You Are Discussing On That Matter-Elections In AP Janasena YCP

జగన్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం చిగురించబోతోంది అని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని పవన్ విమర్శించారు. దానికి కౌంటర్ గా జగన్ మూడు వేళ్లు చూపించి.. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఆరోపించారు. ఆ తరువాత ఎన్నో ఎన్నో విమర్శలు చేసుకున్నారు. కానీ ఆ విమర్శల బాణాలు అటు తిరిగి ఇటు తిరిగి మగతనం మీదకు వెళ్లింది. ఇక ఈ మాటల యుద్ధం కట్టి పెట్టి ఇద్దరూ తమ తమ పార్టీల పటిష్టత గురించి ఆలోచిస్తే మంచిది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలను ఈ ఇద్దరూ పట్టించుకుంటారో లేక ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపించుకుంటూ… మగతనం మీద చర్చలు పెట్టుకుంటారో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.