పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా! త్వరలో ప్రారంభం  

Pawan Kalyan And Trivikram Srinivas Combination Repeat Fourth Time - Telugu Mega Hero\\'s, Pawan Kalyan And Trivikram Srinivas Combination, Repeat Fourth Time, Tollywood

టాలీవుడ్ లో దర్శక, రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో ఎక్కువ సినిమాలు మెగా హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తోనే తీశారు.ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా మినిమం గ్యారెంటీ అనే టాక్ ఇప్పుడు ఉంటుంది.

Pawan Kalyan And Trivikram Srinivas Combination Repeat Fourth Time - Telugu Mega Hero\\'s, Pawan Kalyan And Trivikram Srinivas Combination, Repeat Fourth Time, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

అయితే అతని కెరియర్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా అతి పెద్ద డిజాస్టర్.అలాంటి డిజాస్టర్ ని వారు అస్సలు ఊహించలేదు.

ఆ సినిమా త్రివిక్రమ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తీసింది.అయితే త్రివిక్రమ్ తనలోని రచయితని బయటకి తీసుకొచ్చి అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో మాయ చేసి వరుస హిట్స్ కొట్టి ట్రాక్ లోకి వచ్చేశారు.

త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది.అయితే ఇది సెట్స్ పైకి వెళ్ళాలలంటే కచ్చితంగా మరో సంవత్సరం పడుతుంది.ఈ నేపధ్యంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి కథ చెప్పడం జరిగిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్.ఈ సినిమా కూడా త్రివిక్రమ్ హోం బ్యానర్ హారికా హాసినీ క్రియేషన్స్ లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.

అన్ని అనుకూలంగా జరిగితే పింక్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమాని త్రివిక్రమ్ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు