Pawan Kalyan and Sunny Leone should form political alliance     2017-11-21   00:29:05  IST  Raghu V

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ వర్మ్ స్ట్రోక్ తగిలింది. అర్జున్ రెడ్డి తరువాత కొంత గ్యాప్ ఇచ్చి వేరేవారి మీద పడుతూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పవన్ మీద తన ఎటాక్ మొదలుపెట్టారు. ఈసారి కారణం, సందర్భం ఏమి లేదు. ఊరికే టైమ్ పాస్ లా మొదలుపెట్టి పవన్ – సన్ని లియోన్ మీద అర్థం అయ్యి అర్థం కాని పోస్టులు పెట్టారు‌. ఈ ఇద్దరు కలిసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఒకే పార్టీ ద్వారా పోటి చేయాలని అంటున్నారు ఆర్జీవి.

“సన్ని లియోన్ కి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జనాలు పోగవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం. వచ్చే ఎలక్షన్ లలో సన్ని లియోన్ – పవన్ కళ్యాణ్ ల మధ్య పొత్తు అనేది అసాధారణమైన పొలిటికల్ ఎత్తు అవుతుందని నా ప్రఘాడ నమ్మకం …ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు వినోదభరితమైన సుఖాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న లక్షల ఫ్యాన్స్ కి సన్ని లియోన్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకరికే కౌగిలించుకునే ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారా అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నా ప్రశ్న. పవన్ కళ్యాణ్ – సన్ని లియోన్ కలిసి జనసేన/జన సేవ పార్టీ పెడితే అది సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరికి జనాకర్షణ శక్తి ఉంది.” అంటూ తనకు మాత్రమే సాధ్యపడే రీతిలో చెప్పుకొచ్చారు వర్మ.

మొన్నటికి మొన్న రాజమౌళి – రామ్ చరణ్ – ఎన్టీఆర్ లను స్వలింగ సంపర్కులు అన్న వర్మ, ఆ వివాదం చల్లారక ముందే పవన్ – సన్ని పోస్టులు మొదలుపెట్టారు. మరి ఈ పోస్టులపై పవన్ కళ్యాణ్ – సన్ని లియోన్ స్పందిస్తారో లేదో చూడాలి.