Pawan Kalyan Sujeeth : పవన్‌, సుజీత్‌ సినిమా కంటే ముందు దాన్ని దాటాలట!

Pawan Kalyan And Sujeeth Movie Update , Pawan Kalyan, Sujeeth , Hari Hara Veeramallu, Harish Shankar, Pawan Kalyan, Saaho Flim , Sujeeth

పవన్ కళ్యాణ్ హీరో గా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం లో సినిమా కన్ఫామ్ అయ్యింది.హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కు షూటింగ్ కోసం డేట్లు ఇస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.

 Pawan Kalyan And Sujeeth Movie Update , Pawan Kalyan, Sujeeth , Hari Hara Veeram-TeluguStop.com

కానీ అసలు విషయం ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా తర్వాత కచ్చితం గా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం డేట్లు ఇవ్వబోతున్నాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈ రెండు సినిమా లను పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నాడు అనేది సమాచారం.

ఒక వైపు బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నాడు.మరో వైపు ఇలా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

అంటూ ఆయన అభిమానులు గందరగోళానికి గురి అవుతున్నారు.

Telugu Harihara, Harish Shankar, Pawan Kalyan, Saaho, Sujeeth-Movie

ఇంతకూ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా గా ఏ సినిమా ను తీసుకు వస్తాడు అనేది తెలియడం లేదు. హరిహర వీరమల్లు సినిమా ను వచ్చే సమ్మర్ లో ఏప్రిల్ నెల లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2023 సంవత్సరం లోనే మరో పవన్ కళ్యాణ్ నటించే మరో సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆ సినిమా ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒక సమయం చూసుకొని సినిమాల్లో నటిస్తున్నాడు.

భారీ పారితోషకం వస్తున్న కారణం గా సినిమా లను వదిలి పెట్టట్లేదు అనేది ఆయన సన్నిహితుల మాట.ఆయన ఆర్థిక అవసరాల కోసం వరుసగా సినిమా లను చేస్తూనే ఉన్నాడు.ముందు ముందు కూడా చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube