పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే.అప్పటి నుండి ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొదట ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల డేట్లు మాత్రమే ఇచ్చాడని,

ఆ 30 రోజుల్లోనే సినిమా ని దర్శకుడు సుజిత్ పూర్తి చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడని, అతి త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా ఇదే సంవత్సరం లో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ను విడుదల చేసే విధంగా నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది.
తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ సినిమా లో కథ కాస్త పెద్దగా ఉండడంతో పాటు రెండు పార్ట్ లకు అనుకూలంగా ఉందట.
అందుకే సినిమా ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే వార్తలు ఒట్టి పుకార్లే అంటూ మెగా కాంపౌండ్ వారు ధ్రువీకరించారు.

అయినా కూడా మెగా ఫాన్స్ మాత్రం ఆ వార్తలను తెగ షేర్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా రెండు పార్ట్ లుగా వస్తే కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే ఇలాంటి పుకార్లు రావడం పవన్ కళ్యాణ్ సినిమా విషయం లో ఎప్పుడూ జరిగేదే.కానీ రెండు భాగాలుగా అంటూ వస్తున్న పుకార్లు ఒకింత ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి.
