ఫొటోటాక్ : రిలాక్స్ మూడ్‌లో భీమ్లా నాయక్‌, డానియేల్‌

Pawan Kalyan And Rana Simple Sleep In Bheemla Nayak Sets

పవన్‌ కళ్యాణ్‌.రానా లు కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

 Pawan Kalyan And Rana Simple Sleep In Bheemla Nayak Sets-TeluguStop.com

సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరన ముగింపు దశకు వచ్చింది.ఒక వైపు పవన్ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.

మీడియాలో ఈ సినిమా గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా మరోసారి సినిమాకు సంబంధించిన ఆసక్తికర ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 Pawan Kalyan And Rana Simple Sleep In Bheemla Nayak Sets-ఫొటోటాక్ : రిలాక్స్ మూడ్‌లో భీమ్లా నాయక్‌, డానియేల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈసారి వచ్చింది సినిమా స్టిల్‌ కాదు.ఇద్దరు హీరోలు కూడా షూటింగ్ గ్యాప్ లో అలా సేద తీరుతున్న సమయంలో తీసిన ఫొటో ఇది.పవన్ కళ్యాణ్‌ నులక మంచం మీద పడుకుని ఉండగా.రానా అటు పక్కన ఎడ్ల బండి ఉండగా దానిపై అలా వాలి ఉన్నాడు.

ఇద్దరు చాలా సింపుల్‌ గా అలా పడుకుని ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా పై జనాల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సాగర్‌ చంద్ర ఈ సినిమా ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.మలయాళ సినిమా కు రీమేక్‌ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

ఒరిజినల్‌ వర్షన్ కు చాలా మార్పులు చేర్పులు చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాను మార్చి రాయడం జరిగింది.పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్‌ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రోమో మరియు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Telugu Bheemla Nayak, Bheemla Nayak Pic Talk, Director Sagar K Chandra, Director Trivikram, Film News, Movie News, Nithya Menon, Pawan And Rana, Pawan Kalyan, Rana-Movie

పవన్‌ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్‌ నటించింది.ఒక బిడ్డకు తల్లిగా నిత్యా మీనన్ నటించబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో సంక్రాంతి విజేతగా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి.

త్రివిక్రమ్‌ ఈ సినిమా కు వర్క్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

#Pawan Kalyan #Bheemla Nayak #Sagar Chandra #Rana #Bheemla Nayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube