పవన్ మూవీలో వినాయక్‌.. అప్పుడే డైలాగ్‌ కూడా వైరల్

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో పవన్‌ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు.

 Pawan Kalyan And Rana Movie V V Vinayak In Key Role-TeluguStop.com

పవన్‌ మరియు రానా ల మద్య ఉండే సన్నివేశాలు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయట.రానా కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక పవన్ పోలీస్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మలయాళ వర్షన్ కు చాలా మార్పులు చేర్పులు చేసి తెలుగు లో రీమేక్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

 Pawan Kalyan And Rana Movie V V Vinayak In Key Role-పవన్ మూవీలో వినాయక్‌.. అప్పుడే డైలాగ్‌ కూడా వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా లో వి వి వినాయక్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో రానా కు సన్నిహితంగా ఉండే పాత్ర లో వి వి వినాయక్ కనిపించబోతున్నాడట.

అందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

పవన్ రానా మూవీలో వినాయక్‌ ఉన్నాడో లేడో తేలలేదు.

కాని అప్పుడే ఈ సినిమా లో వినాయక్ చెప్పే డైలాగ్‌ అంటూ ట్రెడ్డింగ్‌ అవుతుంది.పవన్‌ కళ్యాణ్‌ తో రానా పెట్టుకుంటే రానా స్నేహితుడు అయిన వినాయక్ ఒక సన్నివేశంలో పోయి పోయి వీడితో ఎందుకు పెట్టుకున్నావు ఏంటీ అంటాడట.

Telugu #ayyappanumkoshiyum, Film News, Pawan Kalyan, Pawan Movie, Pawan Movie Update, Pawan Rana Movie, Rana, Social Media, V V Vinayak, Viral, Vv Vinayak Dialogue-Movie

ఈ డైలాగ్‌ ఖచ్చితంగా సినిమా లో బాగా పేలుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పవన్‌ మరియు రానా ల కలయిక అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.ఇక వినాయక్‌ కీలక పాత్ర అంటే మరింతగా ఆసక్తి నెలకొంది.హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన వినాయక్ ఇలా ఈ రీమేక్ లో చిన్న పాత్రను చేయబోతున్నాడు.శీనయ్య సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి క్యాన్సిల్‌ అయ్యింది.మరో వైపు చత్రపతి సినిమా ను ఈయన బెల్లంకొండ హీరోతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

#Pawan #VvVinayak #Vinayak #Pawan #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు