భీమ్లా నాయక్‌ పాత్రపై త్రివిక్రమ్‌ ప్రత్యేక శ్రద్ద!

పవన్ కళ్యాణ్‌ హీరో గా వరుసగా రూపొందుతున్న సినిమాలన్నింటిపై కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది అనడంలో సందేహం లేదు.మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ను ప్రస్తుతం రానా తో కలిసి పవన్ చేస్తున్నాడు.

 Pawan Kalyan And Rana Movie Trivikram Key Role-TeluguStop.com

సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో పవన్‌ ను భీమ్లా నాయక్‌ గా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశారు.పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్‌ పాత్ర ను పవన్‌ అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లేను దర్శకుడు త్రివిక్రమ్‌ అందిస్తున్న విషయం తెల్సిందే.సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

 Pawan Kalyan And Rana Movie Trivikram Key Role-భీమ్లా నాయక్‌ పాత్రపై త్రివిక్రమ్‌ ప్రత్యేక శ్రద్ద-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజుల కూడా త్రివిక్రమ్‌ పవన్‌ తోనే ఉంటున్నాడు.పవన్‌ సన్నివేశాలు అన్ని కూడా స్వయంగా మానీటర్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu News, Pawan Kalyan, Pawan Rana, Rana, Trivikram-Movie

పవన్‌ మరియు రానా లు కలిసి నటిస్తున్న ఈ సినిమా లోని భీమ్లా నాయక్ పాత్ర విషయం లో మాత్రం ప్రత్యేకమైన శ్రద్దను త్రివిక్రమ్‌ పెడుతున్నాడని.ఒరిజినల్‌ వర్షన్ లో కంటే కాస్త ఎక్కువ ప్రాముఖ్యతను పవన్‌ పాత్రకు ఇస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా సాధించడం ఖాయం అన్నట్లుగా అభిమానులు కూడా నమ్మకం తో ఉన్నారు.పైగా త్రివిక్రమ్‌ తనదైన శైలి టచ్చింగ్స్ ఇస్తున్న కారణంగా తప్పకుండా సినిమా ను బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.

ఇటీవల విడుదల అయిన పవన్‌ లుక్ కు రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ దక్కాయి.కనుక ఈ సినిమాకు ఏ స్థాయిలో భజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

#Pawan Kalyan #Rana #Pawan Rana #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు