పవన్ సినిమాలో నటించేది రానా కాదట.. ఎవరంటే..?  

pawan kalyan and rana daggubati in ayyappanum koshium remake update - Telugu Ayyappanum Koshium Remake, Nithin, Pawan Kalyan, Rana

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటిస్తుండగా ఈ సినిమా కాకుండా పవన్ మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

TeluguStop.com - Pawan Kalyan And Rana Daggubati In Ayyappanum Koshium Remake

అలా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ ఒకటి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో పవన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తారనే చర్చ జరుగుతోంది.మొదటి నుంచి ఈ పాత్రకు రానా పేరు వినిపించినా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాలో రానాకు బదులుగా నితిన్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

TeluguStop.com - పవన్ సినిమాలో నటించేది రానా కాదట.. ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే రానా ఈ సినిమాలో నటించకపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పవన్ ను అభిమానించే హీరోల్లో నితిన్ ఒకరు.పలు సందర్భాల్లో పవన్ పై తనకు ఉన్న అభిమానం గురించి నితిన్ చెప్పుకొచ్చారు.పవన్ సినిమాలో ఛాన్స్ అంటే నితిన్ నో చెప్పే ప్రసక్తే లేదు.

అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈరోజు ఉదయం నుంచి పవన్ సినిమాలో నితిన్ నటించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతోంది.

రానా ఈ సినిమా గురించి స్పందించని నేపథ్యంలో ఈ వార్త నిజమే కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

అయ్యప్పన్ కోషియమ్ సినిమాను సాగర్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేయడంతో పవన్ సాగర్ కు ఛాన్స్ ఇచ్చారని సమాచారం.

#Nithin #Pawan Kalyan #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan And Rana Daggubati In Ayyappanum Koshium Remake Related Telugu News,Photos/Pics,Images..