పవన్ లోకేష్ లు తలపడబోతున్నారా ?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చలు ఏమైనా ఉన్నాయా అంటే అది ఇసుక వివాదం, గన్నవరం తెలుగుదేశం శాసనసభ్యుడు వల్లభనేని వ్యవహారం.వీటిమీదే చాలా రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

 Pawan Kalyan And Naralokesh Stand In Gannavaram Assembly Bye Polls Elections-TeluguStop.com

గన్నవరం శాసనసభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి వంశీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టుగా అన్నీ పార్టీలు అంచనా వేస్తున్నాయి.అందుకే ఇప్పుడు అక్కడ తమ పార్టీ ప్రతినిధిగా ఎవరిని రంగంలోకి దించాలనే ఆలోచనలో పార్టీలు పడ్డాయి.

Telugu Lokeshloose, Pawankalyan, Pwanloose, Tdp Chandrababu-

వంశీ వైసీపీలోకి వెళ్ళడం దాదాపు ఖాయమైనట్లే.నవంబర్ 3 లేదా 4వ తేదీల్లో వంశీ వైసీపీ కండువా కప్పుకోవడం తప్పదని తేలిపోయింది.అయితే వైసీపీలోకి చేరే ముందు స్పీకర్ ఫార్మేట్ లో వంశీ రాజీనామా చేస్తే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది.అదే జరిగితే టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారు అనేది ఇప్పుడు చర్చగా మారింది.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మీద పోటీ చేసి ఓటమి చెందాడు.

Telugu Lokeshloose, Pawankalyan, Pwanloose, Tdp Chandrababu-

అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమిచెండాడు.ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ తమ తమ పార్టీల తరపున ఇక్కడ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం పోటీ చేసే అవకాశం లేకపోలేదు.

అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఈ ఇద్దరిలో ఎవరు పోటీలో ఉంటారు అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.ఇదే సమయంలో టీడీపీ నుంచి లోకేష్ తో పాటు రకరకాల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి.

మాజీ మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ భార్య అనురాధ, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

Telugu Lokeshloose, Pawankalyan, Pwanloose, Tdp Chandrababu-

అటు వైసీపీ తరుపున ఎక్కువ శాతం వంశీ పోటీ చేసే అవకాశం ఉంది.మరి వంశీ పోటీ చేస్తే వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నర్ధకంగానే కనిపిస్తోంది.ఒకవేళ వంశీకి టికెట్ ఇస్తే వెంకట్రావు టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారనే టాక్ కూడా ఇప్పుడు నడుస్తోంది.

వంశీ వైసీపీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెంకట్రావును టీడీపీలోకి ఆహ్వానించాలని బాబు పార్టీ కీలక నేతలకు సూచనలు చేశారు.ఏమైనా ఇక్కడ పోటీ అనివార్యం అయిన పరిస్థితుల్లో అభ్యర్థులు ఎవరు అయినా పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube