పవన్ , మహేష్ ను కూడా వాడేస్తున్న పోలీసులు.. ఆ డైలాగ్ లతో..?

దేశంలో జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువ ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి.బైక్ నడిపే వాహనదారులలో ఎక్కువమంది హెల్మెట్ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారు.

 Pawan Kalyan And Mahesh Babu Are Also Being Used By Traffic Police, Helmet ,mahe-TeluguStop.com

ఫలితంగా చిన్న ప్రమాదం జరిగినా తల పగిలి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే నగరాల్లో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సెలబ్రిటీల హిట్ సినిమాలలోని సీన్లను మీమ్స్ లా చేసి ప్రజలకు హెల్మెట్ విషయంలో అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా పోలీసులు నాని జెర్సీ సినిమాలో హెల్మెట్ పెట్టుకోవడం గురించి మీమ్స్ వదిలిన సంగతి తెలిసిందే.

ఈ మీమ్స్ బాగా క్లిక్ కావడంతో పోలీసులు పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి సినిమాలోని బొమ్మలతో మీమ్స్ తయారు చేసి వదిలారు.ఒక మీమ్ లో ఒక వ్యక్తి బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ను పెట్టుకుంటూ ఉంటే జల్సా సినిమాలో పవన్ ప్రకాశ్ రాజ్ మధ్య జరిగిన సంభాషణ ద్వారా కింద పడితే హెల్మెట్ ఉపయోగపడాలే తప్ప హెల్మెట్ వల్లే కింద పడొద్దని చెప్పించారు.

Telugu Helmet, Mahesh Babu, Memes, Pawan Kalyan-Movie

మరో ఫోటోలో ఒకే బైక్ పై ఐదుగురు వ్యక్తులు కూర్చొని వెళుతుంటే పోకిరి సినిమలోని బొమ్మలతో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒకటే బండిలో వెళుతున్నారని బైక్ నడిపే వ్యక్తి సరైన విధంగా కూర్చున్నాడో లేదో చెక్ చేసుకోకుండా ప్రయాణం చేస్తున్నారంటూ సెటైరికల్ గా చెబుతున్నారు.పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈ మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .

ఈ మీమ్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయేమో చూడాల్సి ఉంది.సినిమా సెలబ్రిటీలతో పాటు పోలీసులు క్రికెటర్లను కూడా ప్రచారానికి వాడుకుంటూ ఉండటం గమనార్హం.

ఈ మీమ్స్ ప్రజలలో మార్పు రావడానికి కారణమవుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube