'హరిహర వీరమల్లు' విడుదలకు సాధ్యం ఎంత?

పవన్‌ కళ్యాణ్‌.క్రిష్‌ ల కాంబోలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

 Pawan Kalyan And Krish Movie Hari Hara Veeramallu Release News-TeluguStop.com

కాని సెకండ్‌ వేవ్‌ క్రిష్ ప్లాన్స్ మొత్తం తలకిందులు అయ్యేలా చేసింది.షూటింగ్‌ ను ఆగస్టు లేదా సెప్టెంబర్‌ వరకు పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి జనవరి లో సంక్రాంతికి హరి హర వీరమల్లు సినిమా ను విడుదల చేయాలని భావించారు.

కాని షూటింగ్‌ పూర్తి అయ్యేందుకు నవంబర్‌ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి.వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి.

 Pawan Kalyan And Krish Movie Hari Hara Veeramallu Release News-హరిహర వీరమల్లు’ విడుదలకు సాధ్యం ఎంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపుగా 50 కోట్ల రూపాయలను గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేయబోతున్నారట.కనుక కాస్త ఆలస్యం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

Telugu Film News, Hari Hara Veeramallu, Krish Movie, Movie News, Nidhi Agarwal, Pawan Kalyan-Movie

షూటింగ్‌ ఆలస్యం అవుతున్న ఈ సమయంలో హడావుడిగా గ్రాఫిక్స్ వర్క్‌ ను చేయడం ఇష్టం లేని క్రిష్‌ సినిమా ను మెల్లగా నే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లో అది కూడా ఉగాది కానుకగా వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమా ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు.ఇక నిధి అగర్వాల్‌ ఈ సినిమా లో కనిపించబోతుంది.ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ సినిమా పై అంచనాలు పీక్స్‌ కు తీసుకు వెళ్లింది.మొదటి సారి పవన్ నుండి ఈ తరహా సినిమా రాబోతుంది.

కనుక అంతా కూడా ఇంట్రెస్ట్‌ గా చూస్తున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

 ఈ సినిమా లో పవన్‌ కళ్యాణ్‌ దొంగ గా కనిపిస్తాడని.నిధి అగర్వాల్‌ అతడిని మోసం చేసే మోసగత్తేగా కనిపిస్తుందని అంటున్నారు.

ఇక బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఈ సినిమా లో కీలక పాత్రలో నటించబోతుందట.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

#Nidhi Agarwal #Krish #Pawan Kalyan #HariHara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు