పవన్, తారక్ బ్యాడ్ లక్ తో వదిలేసిన సినిమాలతో స్టార్ గా ఎదిగిన ఆ హీరో ఎవరు..?

చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్న కూసింత అదృష్టం లేకపోతే.కెరీర్ ఎక్కడో చోట ఆగిపోవాల్సిందే.

 Pawan Kalyan And Ntr Rejected Movies, Hero Nani, Nani Success In Tollywood, Mass-TeluguStop.com

అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అదృష్టవంతులు చాలామందే ఉన్నారు.ఒకప్పటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి నిన్నమొన్న వచ్చిన విజయ్ దేవరకొండ వరకు వాళ్ళ టాలెంట్ కి తోడు అదృష్టం కూడా తోడవ్వడం వల్లనే వాళ్ళు స్టార్స్ గా ఎదిగి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

అయితే మనమిప్పుడు మన తెలుగు సినీమా ఇండస్ట్రీలో అదృష్టవంతులైన హీరోల గురించి మాట్లాడుకుందాం.

 Pawan Kalyan And Ntr Rejected Movies, Hero Nani, Nani Success In Tollywood, Mass-TeluguStop.com

ఈ లిస్ట్ లో ముందుగా మనం హీరో రవితేజ గురించి మాట్లాడుకోవాలి.

బద్రి సినిమాతో పూరి జగన్నాధ్ కి లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటే పూరి జగన్నాధ్ కి చాలా ఇష్టం అందుకే.పూరి కెరియర్ స్టార్టింగ్ లో ఏ కథ రాసుకున్న ముందు పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని రాసేవారట అయితే పవన్ కొన్ని కారణాల వలన ఆ సినిమాలను చేయకపోవడంతో ఆ అదృష్టం అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న రవితేజకి దక్కింది.

దాంతో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ.అంతేకాదు పూరిగారి దయ అంటూ మాస్ మహారాజ్ అనే బిరుదు కూడా రవితేజకు దక్కింది.ఇకపోతే పవన్ పూరి సినిమాలనే కాదు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసి.మహేష్ బాబు హీరోగా నటించిన “అతడు” సినిమా కూడా పవన్ కల్యాణే చేయాల్సి వుంది కానీ ఆ సినిమా కూడా పవన్ చేయలేకపోయాడు.

Telugu Badri, Bhalebhale, Chupista Mama, Sunil, Nani, Massmaharaj, Nani Tollywoo

అంతేకాదు ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అలరించిన జై లవకుశ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే.అయితే ఈ కథ ముందు రవితేజకి చెప్పాడట డైరెక్టర్ బాబీ.కానీ రవితేజ ఈ సబ్జెక్టు ని ఓకే చేయలేకపోయాడు.కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని హిట్ కొట్టాడు.ఇక రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా ముందు ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించాడట.కానీ ఎన్టీఆర్ అంధుడు క్యారెక్టర్ కావడంతో నో చెప్పాడు.దాంతో రవితేజకి ఆ అదృష్టం వరించి అయన కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది.

అలా ఇద్దరి సినిమాలు సూపర్ హిట్ కావడం ఏ సినిమా సబ్జెక్టు కి ఆ హీరో సూట్ అవ్వడం జరిగింది.

ఇక మనం అదృష్టవంతుల లిస్ట్ లో నాని గురించి కూడా మాట్లాడుకోవాలి.

నాని డైరెక్టర్ అవుదాం అని ఇండస్ట్రీకి వచ్చాడు కానీ ఇంద్రగంటి గారు నాని లో ఒక హీరో ఉన్నాడని గుర్తించి.అష్ట చమ్మా సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు.

ఆ సినిమా హిట్ కావడంతో ఇక నాని హీరోగానే సెట్ అయ్యాడు.ఆతర్వాత పిల్ల జమిందార్ అనే సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి.

రాజమౌళి ఈగలో అవకాశం అందిపుచ్చుకున్నాడు.అక్కడా హిట్ కొట్టిన నానికి ఆ తర్వాత అన్ని ప్లాప్ సినిమాలే పడ్డాయి.

కృష్ణవంశీ గారి పైసా సినిమా నుండి జెండాపై కపిరాజు సినిమా వరకు వరస ప్లాప్ లను చూసాడు.అయితే ఎవడె సుబ్రహ్మణ్యం అంటూ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు నాని ఇక ఆతర్వాత నాని అదృష్టం అతని పక్కనే ఉండి నడిపించింది.

Telugu Badri, Bhalebhale, Chupista Mama, Sunil, Nani, Massmaharaj, Nani Tollywoo

ఎవడె సుబ్రహ్మణ్యం హిట్ తర్వాత బలే బలే మగాడివోయ్ సినిమా చేసాడు అదికూడా సూపర్ హిట్ అయింది.అయితే డైరెక్టర్ మారుతీ ఈ బలే బలే మగాడివోయ్ సినిమా ముందు హీరో అండ్ కమెడియన్ అయిన సునీల్ గారితో చేద్దాం అనుకున్నారట.అయితే సునీల్ కధలో మార్పులు చెప్పడంతో అది నచ్చని మారుతీ నానిని పెట్టి సినిమాతీసి హిట్ కొట్టాడు.ఇక ఆతర్వాత నాని లైఫ్ లోనే 35 కోట్ల మార్కెట్ తెచ్చిపెట్టిన సినిమా.

అలాగే మాస్ హీరోగా నానిని న్యాచురల్ స్టార్ ని చేసిన సినిమా నేను లోకల్.అయితే ఈ సినిమాని ముందు రాజ్ తరుణ్ తో తీద్దాం అని అందరూ అనుకున్నారు.

అయితే రాజ్ తరుణ్ “సినిమా చూపిస్త మామ” అనే హిట్ సినిమాతో అప్పుడు మంచి ఫామ్ లో ఉండడం వలన కొద్దిగా నిర్మాతలకి కండిషన్స్ పెట్టాడట దాంతో ఆ అవకాశం నానికి దక్కింది.సో, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కి తోడు అదృష్టం కూడా తోడైతే ఎలా ఉంటుందో, దరిద్రం వారి చుట్టూనే తిరుగుతుంటే ఎలా ఉంటుందో.

ఈ హీరోలను చూస్తే అర్ధమైపోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube