పవన్ కళ్యాణ్-బాలకృష్ణ మధ్య సంక్రాంతి పోటీ  

Pawan Kalyan And Balayya Will Be Going on Sankranthi Race, Tollywood, Telugu Cinema, Mega Fans, Nandamuri Fans, Pawan Kalyan, Balakrishna, Vakeel Saab Movie - Telugu Balakrishna, Mega Fans, Nandamuri Fans, Pawan Kalyan, Pawan Kalyan And Balayya Will Be Going On Sankranthi Race, Telugu Cinema, Tollywood, Vakeel Saab Movie

మెగా హీరో చిరంజీవికి, నందమూరి హీరో బాలకృష్ణకి సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడూ పోటీ ఉండేది.ఇద్దరూ చాలా సందర్భాలలో థియేటర్ లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.

TeluguStop.com - Pawan Kalyan And Balayya Will Be Going On Sankranthi Race

అప్పట్లో వీరి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే అభిమానులు కూడా అదే స్థాయిలో థియేటర్ వద్ద హంగామా ఉండేది.అయితే ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ, చిరంజీవి మధ్య జరిగిన సినిమా పోటీలో ఒక్కోసారి ఒక్కొక్కరు సక్సెస్ అయ్యారు.

ఆ తరువాత కూడా మెగా హీరోల సినిమాలకి, నందమూరి హీరోల సినిమాలకి మధ్య చాలా సందర్భాలలో పోటీ వాతావరణం నెలకొంది.ఇప్పుడు మరోసారి అలాంటి పోటీని సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు.

TeluguStop.com - పవన్ కళ్యాణ్-బాలకృష్ణ మధ్య సంక్రాంతి పోటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.ఇక బాలకృష్ణ కూడా బోయపాటి సినిమాతో సంక్రాంతి రేసులోకి రావడానికి రెడీ అయ్యాడు.

అన్ అఫీషియల్ గా వినిపిస్తున్న జనవరి 15న బాలకృష్ణ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా, పవన్ వకీల్ సాబ్ ను జనవరి 14న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.బాలకృష్ణ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ వినిపించినా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

సింహా- లెజెండ్ తర్వాత బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బోయపాటి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తన జోనర్ లోనే తెరకెక్కిస్తున్నారు.మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.

ఇక పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తో సంక్రాంతికి వస్తున్నాడు.నిర్మాత దిల్ రాజుతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇంతకుముందు పవన్ నటించిన అజ్ఞాతవాసితో బాలయ్య బాబు నటించిన జై సింహా 2018 సంక్రాంతి బరిలో పోటీకొచ్చింది.ఇప్పుడు రెండోసారి సంక్రాంతి బరిలో ఆ ఇద్దరి సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కానున్నాయి.

అయితే అప్పుడు ఇద్దరికి సంక్రాంతి హిట్ ఇవ్వలేదు.మరి ఈ సారి సంక్రాంతి సీజన్ ఎవరికి హిట్ ఇస్తుందో చూడాలి.

#Pawan Kalyan #Nandamuri Fans #PawanKalyan #Balakrishna #Mega Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan And Balayya Will Be Going On Sankranthi Race Related Telugu News,Photos/Pics,Images..