పవన్ కట్టప్ప..టీడీపీకి కట్టు బానిస   Pawan Kalyan Anantapur Tour Viral In Social Media     2018-01-29   21:50:43  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే బాహుబలి సినిమా గుర్తుకు వస్తోంది అంటున్నారు నెటిజన్లు ఎందుకు అంటే వారు చెప్పే రిజన్స్ ఎంతో ఫన్నీ గా ఉంటాయి..అసలు వారు ఏం చెప్తున్నారో మీరు చుడండి..బాహుబలిలో ఉండే కట్టప్పకి అపారమైన శక్తి ఉంటుంది..తను ఏం చెప్తే అది చేయగల కండలు తిరిగిన యోధులు ఉన్నారు కానీ అలాంటి కట్టప్ప ఓ రాజు మాటకి కట్టు బానిస..బాహుబలి సినిమాలో ఉండే ఈ క్యారెక్టర్ సరిగ్గా పవన్ కి సరిపోతుంది అంటున్నారు..ఎందుకంటే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏపీ ప్రజలలో ఎంత మద్దతు ఉందొ వేరే చెప్పవలసిన అవసరం లేదు..టిడిపి ప్రభుత్వాన్ని 2014 లో అధికారంలోకి తెచ్చిన ఘనత తనదే అయితే ఇప్పుడు..కూడా టిడిపి పవన్ మద్దతు కోరుతోంది..అయితే పవన్ మాత్రం తనకి ఉన్న ఇమేజ్ ని తగ్గించుకుని మరీ కట్టు బానిసలా ఓ పార్టీకి కొమ్ము కాయడం చేస్తుంటే పవన్ తిక్క మాటేమో కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఈ తిక్క తేనెపట్టు రేగినట్టుగా రేగిపోఎలా ఉంది..అసలు పవన్ కళ్యాణ్ టిడిపికి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు..ఇంతకూ ముందు ప్రజా సభలలో మాట్లాడిన మాటలకి ఇప్పటి మాటలకి పొంతన లేదు..అంటూ నివ్వెర పోతున్నారు..

పవన్ పై పై కి చెప్తోంది ఒకటి లోపల చేస్తోందోకటి అసలు ఏమి మాట్లాడుతున్నాడో పవన్ కి కూడా అర్థం అవుతుందా లేదా అంటూ సామాన్య ప్రజలే కాదు తన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు…”చలొరే చలొకే చల్” కార్యక్రమంలో భాగంగా పవన్ మొదలుపెట్టిన అనంతపురం జిల్లా యాత్రే అందుకు నిదర్శనంగా నిలిచింది..పవన్ అనంతపురం లో మొదలు పెట్టిన యాత్ర తరువాత ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్ళి కలిసారు.ఆ తర్వాత ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేశారు. తర్వాత కదిరి పర్యటనలో ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష ఇంటికి వెళ్ళారు..అయితే పవన్ ఎక్కినా మెట్లు దిగే మెట్లు టిడిపి వాళ్ళవే కావడం ఎంతో విశేషం..అంతేకాదు పవన్ నేరుగా వారిని వెళ్లి కలిశారు తప్ప ఎవరు పవన్ దగ్గరకి వచ్చి కలవలేదు.

అయితే పరిటాల సునీత ఇంటికి వెళ్ళటాన్ని పవన్ సమర్ధించుకున్నాడు మీడియా అడిగిన ప్రశ్నకి పవన్ సంధానం కాకలు తీరిన మీడియా మిత్రులకి కళ్ళు గిర్రున తిరిగాయి… రైతుల సమస్యలు తెలుసుకునేందుకే మంత్రి ఇంటికి వెళ్ళినట్లు చెప్పారు. అంటే గడచిన మూడున్నరేళ్ళల్లో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవీ పవన్ కు తెలీవనే అనుకోవాలా..లేక టిడిపి ప్రభుత్వం సరిగా పని చేయడం లేదు అని చెప్పాలా..అయితే ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతోంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి పవన్ పొత్తు ఖాయం..అంతేకాదు..పవన్ చేస్తున్న యాత్రలు కూడా టిడిపి ఇంతకూ ముందు చేసి వదిలేసినా ఇంటింటికి టిడిపి కి కొనసాగింపు లా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు..అయితే ఏపీ ప్రజలు ఎవరు పవన్ ని నమ్మే పనిలో లేరని..పవన్ వేస్తున్న ఈ వేషాలు సినిమాలలో చేస్తే హీరో ఇజం పోయి సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.