ఇప్పుడు పాతికేళ్ల రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా.. ప‌వ‌న్‌?

రాష్ట్రంలో ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలిచి తీరాల‌నేది త‌న సంక‌ల్పం.

 Pawan Kalyan Allegations On Ap Tdp Party-TeluguStop.com

దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న మైలేజీ పెంచుకు నేందుకు చేస్తున్న కొన్ని ప్ర‌య‌త్నాలు మాత్రం ఒకింత ఎబ్బెట్టుగానే ఉంటున్నాయి.

అధికార పార్టీని ఆ పార్టీ నేత‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.కానీ, అదేస‌మ‌యంలో యాంటీ ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

దీనికి అందివ‌చ్చిన ప్ర‌తి అవ కాశాన్నీ వినియోగింజుకుంటున్నారు.ఈ క్ర‌మంలోనే తాజాగా శ్రీకాకుళంలో వ‌చ్చిన తుఫానును ప‌వ‌న్ త‌న‌కు అనుకూ లంగా మ‌లుచుకున్నాడు.

ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు.

అదేస‌మ‌యంలో క‌ట్టుబ‌ట్ట‌లు కూడా మిగ‌ల‌ని స్థితిలో అనాధ‌లుగా, అభాగ్యులుగా మారిపోయిన తుఫాన్ బాధితుల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న 25 కిలోల బియ్యం.త‌దిత‌ర వ‌స్తువుల‌ను కూడా ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.మ‌రి ఏ ప్ర‌భుత్వ‌మైనా ఏం చేయాలి? ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం సాయం చేయాలి.ఇది ఎక్క‌డైనా.ఏ ప్ర‌భుత్వ‌మైనా చేసేదే.అయితే, ప‌వ‌న్ దీనిని కూడా విడిచి పెట్టకుండా విమ‌ర్శించారు.గత రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ సిక్కోలులో పర్యటిస్తున్నారు.

వజ్రపుకొత్తూరు మండలంలో పవన్‌కల్యాణ్‌ పర్యటించిన మాట్లాడిన ఆయన… సిక్కోలు ప్రజలకు ఇప్పట్లో కావాల్సింది పాతిక కిలోల బియ్యం కాదు.పాతికేళ్ల భవిష్యత్ అందించాలని అన్నారు.

కరెంట్, మంచినీరు ఇచ్చేసి జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని బయట ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని పవన్ విమ‌ర్శించాడు.నిజానికి పాతికేళ్ల అభివృద్ధిని అందించాల‌నే విష‌యంలో ఎలాంటి విభేదాలు లేక‌పోయినా.

ప‌వ‌న్ చేస్తున్న అర్ధ‌ర‌హిత విమ‌ర్శ‌ల‌పై మాత్రం తీవ్ర ప్ర‌తివిమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు కాలుకాలిన వాడికి మందు వేసి క‌ట్టు క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, కానీ, ప‌వ‌న్ మాత్రం దీనిని వ‌దిలేసి ఎప్పుడు పాతికేళ్ల రాజ‌కీయాల‌ను తెర‌మీదికి తెస్తున్నార‌ని, ఈ స‌మ‌యంలో ఆయ‌న చేయాల్సిన స‌ద్విమ‌ర్శ‌లు చాలానే ఉంటాయ‌ని అంటున్నారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు చేయాల్సిన అన్ని ప‌నుల‌ను చేస్తున్నది.కానీ, మిగిలిన వారే త‌మ బాధ్య‌త‌ను విస్మ‌రిస్తున్నార‌ని అంటున్నారు.ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన వారు స‌మ‌యానికి వెళ్లకుండా.చిన్న‌పాటి విమ‌ర్శ‌ల‌తో స‌రిపెడితే.ఎవ‌రికి ల‌బ్ధి చేకూరిన‌ట్టు? పాతికేళ్ల ప్ర‌పంచం బాగుండాలంటే.ఇప్పుడు క‌ష్టాల్లో ఉన్న‌వారికి చేయూత ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తిస్తే మంచిదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube