అల్లు అర్జున్‌ మళ్లీ తలపొగరు చూపించాడంటున్న పవన్‌ ఫ్యాన్స్‌

మొదటి నుండి కూడా అల్లు అర్జున్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పడటం లేదు.ఆ కోపం మళ్లీ మళ్లీ మరింతగా పెరిగేలా అల్లు అర్జున్‌ వ్యవహరిస్తూ ఉన్నాడు.

 Pawan Kalyan Fans Angry On Allu Arjun About Akiranandhan Birthday Celabrations,-TeluguStop.com

గతంలో పలు సార్లు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో కాస్త చిన్నతనం చేసినట్లుగా మాట్లాడటం ప్రవర్తించడం చేయడంతో పవన్‌ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్‌ అంటే పీకల్లోతు కోపంగా ఉన్నారు.ఈమద్య కాస్త ఈ విషయం మర్చిపోయినట్లుగా అనిపించినా కూడా మళ్లీ మొదటికి వచ్చింది.

అల్లు అర్జున్‌ను ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు.

Telugu Akiranandhan, Allu Arjun, Fans, Pawan Kalyan, Tollywood-Movie

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా పుట్టిన రోజు సందర్బంగా చాలా మంది ట్వీట్స్‌ చేశారు.అల్లు అర్జున్‌ మాత్రం అకీరా బర్త్‌డేకు ట్వీట్‌ చేయలేదు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరంజీవి, నాగబాబు, చరణ్‌, తేజ్‌లు ఇద్దరు కూడా ట్వీట్స్‌ చేసి బర్త్‌డే శుభాకాంక్షలు చెబితే బన్నీ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

నిన్న హ్యాష్‌ ట్యాగ్‌ విషయంలో బన్నీని మించి అకీరా ట్విట్టర్‌లో దూసుకు పోయాడు.ఆ కుళ్లుతోనే బన్నీ ఇలా ట్వీట్‌ చేయలేదేమో అంటున్నారు.

అల్లు అర్జున్‌కు మొదటి నుండి కూడా పవన్‌ కళ్యాణ్‌ అంటే చిన్న చూపు ఉందని, అందుకే అకీరాను కూడా పట్టించుకోలేదని, నిన్న బర్త్‌డే జరుపుకున్న అఖిల్‌కు మాత్రం శుభాకాంక్షలు చెప్పాడు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ విమర్శలు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో బన్నీకి వ్యతిరేకంగా మళ్లీ పవన్‌ ఫ్యాన్స్‌ ప్రచారం మొదలు అయ్యింది.

ఈ ప్రచారం మరెంత దూరం వరకు వెళ్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube