పవన్‌ అక్కడేం చేస్తున్నాడు?  

Pawan Kalyan Abroad For Makeover..?-

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా షూటింగ్‌లో త్వరలో పాల్గొనబోతున్నట్లుగా ఇన్ని రోజులుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో మరియు మీడియాలో వార్తలు వచ్చాయి.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘గబ్బర్‌సింగ్‌`2’ షూటింగ్‌ను అభిమానుల కోసం అన్నట్లుగా గత నెల చివర్లో ప్రారంభించారు.

ఆ చిత్రీకరణలో పవన్‌ పాల్గొన్నది లేదు.ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రారంభిస్తామని నిర్మాత శరత్‌ మారార్‌ చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan Abroad For Makeover..?--Telugu Gossips Pawan Kalyan Abroad For Makeover..?---

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ అసలు దేశంలోనే లేడని, విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పవన్‌ ప్రస్తుతం విదేశాల్లో ఎందుకు ఉన్నాడు.అక్కడకు ఏం పనిపై వెళ్లాడు అనే చర్చ ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.ఎప్పుడు వెళ్లాడు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.

ఇక ఈయన మరో పది రోజుల తర్వాత విదేశాల నుండి వస్తాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కాని ఎప్పుడు వచ్చేది మాత్రం వారు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు విదేశాలకు వెళ్లాడేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటే, సినిమాలో మంచి లుక్‌తో కనిపించే ఉద్దేశ్యంతో మేకోవర్‌కు విదేశాలకు వెళ్లి ఉండవచ్చు అని కొందరు అంచనా వేస్తున్నారు.మొత్తానికి పవన్‌ ఫారిన్‌ టూర్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

.

తాజా వార్తలు